ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం చంద్రబాబుతో అరవింద్ కేజ్రీవాల్ భేటీ - దిల్లీ సీఎం

తొలిసారిగా అమరావతికి విచ్చేసిన దిల్లీసీఎం అరవింద్ కేజ్రీవాల్​కు ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.

సీఎం చంద్రబాబుతో అరవింద్ కేజ్రీవాల్ భేటీ

By

Published : Feb 18, 2019, 9:47 PM IST

Updated : Feb 18, 2019, 9:54 PM IST

సీఎం చంద్రబాబుతో అరవింద్ కేజ్రీవాల్ భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబుతో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. తొలిసారిగా అమరావతికి విచ్చేసిన కేజ్రీవాల్​కు మంత్రులు దేవినేని ఉమా, నారా లోకేష్ ఘనస్వాగతం పలికారు. అనంతరం నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి మంత్రి లోకేష్ వివరించారు. రియల్​టైం గవర్నెన్స్ ద్వారా పాలనలో తీసుకొచ్చిన మార్పులు, టెక్నాలజీ సహాయంతో ప్రజలకు అందిస్తున్న మెరుగైన సేవలు, సంక్షేమ కార్యక్రమామల అమలుకు సంబంధించిన తదితర అంశాలను కేజ్రీవాల్​కు తెలిపారు. గ్రామాల అభివృద్ధి, గ్రామాలకు టెన్ స్టార్ రేటింగ్ , వివిధ శాఖలకు ఉపాధి హామీ పథకం అనుసంధానం ద్వారా చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించిన విషయాలను మంత్రి నారా లోకేష్ సీఎం అరవింద్ కేజ్రీవాల్​కి తెలియజేశారు.

అనంతరం సీఎం చంద్రబాబుతో, సమావేశ మయ్యారు. ఈ భేటీలో ఎన్జీయేతర కూటమి బలోపేతం చేయడం, తదుపరి కార్యచరణం అంశాలపై ప్రధానంగా చర్చించారు.

Last Updated : Feb 18, 2019, 9:54 PM IST

ABOUT THE AUTHOR

...view details