ఆసియా బ్యాంకు అధికారులతో సీఎస్ భేటీ
విశాఖ-చెన్నై కారిడార్ అభివృద్ధిపై ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ భేటీ అయ్యారు. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఏడీబీ.. భారత దేశ డైరెక్టర్ కెన్నిజీ యెుకహామా, బ్యాంకు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఛత్రపతి శివాజి తదితర ప్రతినిధులు అమరావతి సచివాలయంలో సమావేశం నిర్వహించారు. విశాఖ- చెన్నై కారిడార్ లో తదుపరి అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపైన వారు సీఎస్ చర్చించారు.
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పారిశ్రామిక రంగాభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోంటుందని సీఎస్ అన్నారు. ప్రభుత్వం పెద్దఎత్తున పరిశ్రమలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. రెండంకెల అభివృద్ధి సాధనలో రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే మందు వరుసలో ఉందని వివరించారు.
ఎడీబీ అధికారులు సకాలంలో అభివృద్ధి పనులకు తోడ్పాటు అందించాలని కోరారు. బ్యాంకు ప్రధానంగా ఏఏ రంగాల్లో తోడ్పాటు అందిస్తుందని ఆరా తీశారు. ఆసియా బ్యాంకు ప్రధానంగా రవాణా, ఇంధన, రేవులు, తాగునీటి సరఫరా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తదితర రంగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి తమ బ్యాంకు తగిన బుుణ సహాయం కల్పించటం జరుగుతోందని తెలిపారు.
పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడీబీ విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో వివిధ సదుపాయాల అభివృద్ధికి విశాఖ మెడికల్ టెక్నాలజీ పార్కుకు, విశాఖలో తాగునీటికి సంబంధించి బుుణం అందిస్తున్నామని వివరించారు.