Thug ran away after hitting the police vehicle: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని అడ్డగించబోయిన.. టాస్క్ఫోర్స్ పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి పరాయ్యారు దుండగులు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గబ్బంగి వద్ద జరిగింది. గంజాయి అక్రమ రవాణాపై ముందస్తు సమాచారంతో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారి, డీఎస్పీ రాజు తన బృందంతో తనిఖీలు నిర్వహిస్తుండగా.. అటుగా వస్తున్న కారుని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. స్మగ్లర్లు అత్యంత వేగంగా వచ్చి టాస్క్ఫోర్స్ పోలీసుల వాహనాన్ని ఢీకొట్టారని తెలిపారు. ఈ ఘటనలో పోలీసుల బొలెరో వాహనం టైర్ పేలిపోయింది. నిందితులను పోలీసులు వెంబడించగా.. రెండు కిలోమీటర్ల తర్వాత చింతల వీధిలో గంజాయి ఉన్న కారును వదిలి పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఆ కారు పశ్చిమ బంగకు చెందినదిగా వెల్లడించారు. కారులో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అత్యంత ప్రమాదం నుంచి తాము బయటపడ్డామని డీఎస్పీ రాజు చెప్పారు.
గంజాయి అక్రమ రవాణా చేస్తూ... పోలీసులపై..! - Thug ran away after hitting
Thug ran away after hitting: కొందరు అక్రమార్కులు గంజాయిని తరలించేందుకు వివిధ మార్గాలను ఎన్నుకుంటున్నారు. వారి కదలికల్ని ఎప్పటికప్పుడు పసిగడుతునే ఉన్నారు పోలీసులు. అలా కారులో గంజాయిని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు అడ్డుకోబోగా.. రెచ్చిపోయిన స్మగ్లర్లు పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి పారిపోయారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది.
hug ran away after hitting