Road Accident : మహా శివరాత్రి పర్వదినాన పలు రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. శివరాత్రి పండుగను పురస్కరించుకొని దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. జరిగిన కారు ప్రమాదంలో బాపట్ల జిల్లాలో ఓ ఎస్సై కుంటుంబం, అల్లూరి జిల్లాలో సంభవించిన బైక్ ప్రమాదంలో స్నేహితులు మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది.
SI Family Died In Car Accident : శివరాత్రి పండగను పురస్కరించుకొని కారులో చినగంజాం తిరునాళ్లకు వెళ్లిన ఎస్సై కుంటుంబం తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ప్రమాదం జరగడంతో డ్రైవర్‌తో సహా మొత్తం ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు.
పోలీసుల కథనం ప్రకారం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద శ్రీ బ్రమరా టౌన్ షిప్ ఎదురుగా ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఎస్సై కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు జిల్లాలోని చినగంజాం నుండి అద్దంకి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. అద్దంకి వైపు వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్ పై నుండి ఒంగోలు వెళ్లు మార్గం వైపునకు రావటంతో రహదారిపై ఒంగోలు వైపు వెళుతున్న లారీ కారుపైకి ఎక్కటంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ కారణంగానే కారులో ప్రయాణిస్తున్న ఎస్సై భార్య వహిదా(35), కుమార్తె అయేషా(9), బంధువులు గుర్రాల జయశ్రీ (50), గుర్రాల దివ్యతెజ (29), డ్రైవర్ బ్రహ్మచారి(22)తో సహా మొత్తం ఐదుగురు దుర్మరణం చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
Three Friends Died In Bike Accident : అల్లూరి జిల్లా అనంతగిరి మండలం లొంగుపర్తి పంచాయతీ రాయిపాడు గ్రామం వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. హుకుంపేట మండలం దిగువ సాల్తాంగి గ్రామానికి చెందిన బుట్టన్న, గణేష్, రాంబాబు అనే ముగ్గురు మరణించారు. అనంతగిరి మండలంలోని బొర్రా గుహల్లో జరిగిన శివరాత్రి వేడుకలను తిలకించి తిరిగి స్వగ్రామానికి బయలుదేరి బైక్‌పై వెళ్తుండగా రాయపాడు గ్రామం వద్ద బైక్ అదుపుతప్పి లోయలోకి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు పండుగ ఫోన్ చేసుకునేందుకు వెళ్లి ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పోలీసులు మృతదేహాలను వైద్య కేంద్రం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి :