Mother killed her child: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో ఓ మహిళ తన నాలుగు నెలల చిన్నారిని చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. పాడేరుకు 15 కిలోమీటర్ల దూరంలోని హుకుంపేట మండలం తడిగిరిలో అరిసెల రాధిక అనే మహిళ.. మంగళవారం సాయంత్రం తన నాలుగు నెలల చిన్నారిని హత్య చేసి ఉరి వేసుకుంది. పొలం పనుల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త ఇది చూసి నిర్ఘాంతపోయాడు. కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలకు సమాచారం అందించాడు. తల్లి రాధికకు కొన్ని రోజులుగా మానసికస్థితి సరిగాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mother killed her child: బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య... ఎక్కడంటే..? - హుకుంపేటలో తల్లి ఆత్మహత్య
Mother killed her child: రాష్ట్రంలో నేరాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీయడం, తీసుకోవడం సర్వసాధారణంగా మారుతోంది. ఇటీవలి రుణ యాప్ మరణాలు, దాడులు, ఆత్మహత్యల ఘటనలు మరువక ముందే... తాజాగా బిడ్డను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే..?
బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య