ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Flood Effect: వరద మిగిల్చిన వేదన... విలీన మండలాలు అతలాకుతలం

Flood Effect: పెళ్లంటేనే ఇల్లంతా సందడి. వధువు, వరుడి ఇళ్లను రంగులు వేసి, తోరణాలు కట్టి సిద్ధం చేస్తారు. ముహూర్తానికి వారం ముందుగానే ఇల్లంతా బంధువులతో కళకళలాడుతుంది. కుమార్తె వివాహాన్ని ఘనంగా చేయాలన్న కన్నతండ్రికి వేదనను మిగిల్చింది. అసలేం జరిగిందంటే..?

flood effect
వరద మిగిల్చిన వేదన

By

Published : Jul 31, 2022, 8:17 AM IST

Flood Effect: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో గోదావరి వరద వీటన్నింటినీ దూరం చేసింది. ఘనంగా తన కుమార్తెకు వివాహం చేయాలని ఆశించిన ఆ తండ్రికి వేదనే మిగిలింది. కూనవరం మండల కేంద్రానికి చెందిన కాలేపు చిన్నా చిరువ్యాపారి. ఏలూరుకు చెందిన యువకుడితో పెద్ద కుమార్తెకు ఆగస్టు 3న తన ఇంటి వద్ద వివాహం జరపాలని నెల క్రితం నిశ్చయించారు. ఇంతలో గోదావరి వరదతో ఆయన ఇల్లు మునిగిపోయింది. కట్టుబట్టలతో చిన్నా కుటుంబసభ్యులు పునరావాస కేంద్రానికి వెళ్లారు. ప్రస్తుతం వరద తగ్గినా ఇల్లంతా బురదమయమైంది. దాన్ని శుభ్రం చేసేందుకూ సమయం లేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఏలూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆగస్టు 3న అక్కడి నుంచి వరుడి ఇంటికి వెళ్లి వివాహం జరపనున్నారు.

ABOUT THE AUTHOR

...view details