ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM

.

ఏపీ ప్రధాన వార్తలు
AP TOP NEWS

By

Published : Nov 27, 2022, 9:02 PM IST

  • ఉగ్రవాద పార్టీకి సజ్జల సలహాదారు: పవన్​ కల్యాణ్​
    అన్నమయ్య డ్యామ్​ కొట్టుకుపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జనసేన అధినేత పవన్​కల్యాణ్​ ఆరోపించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేసిన పవన్​.. చెట్లు నరికేవాళ్లు గరుడ పురాణం చదవాలన్నారు. 200 మంది ప్రాణాలను కాపాడిన లష్కర్​ రామయ్యను అభినందించి.. రూ.21 లక్షలు ఆర్థిక సాయం చేశారు. రాయలసీమకు చెడ్డపేరు తెస్తున్న సజ్జల.. ఉగ్రవాద పార్టీకి సలహాదారుగా ఉన్నారని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పవన్​పై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు... ఏమన్నారంటే..!
    వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తానన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. షూటింగ్‌ గ్యాప్‌లో వచ్చి రెండు గంటలు వీకెండ్‌ మీటింగ్‌లు పెడితే ప్రజలు నమ్మరని పవన్‌ గ్రహించాలని.. రోజా సూచించారు. ఎవరో రాసిచ్చిన మాటలను ఆవేశంగా చెబితే సరిపోదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మద్య నిషేదం, నిషేదం అంటూనే.. 3 పెగ్గులు, 6 గ్లాసులుగా బెల్టు షాపులు
    రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందని అని చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే వీధి చివర, ఇంటి పక్కన.. ఇలా ఎక్కడ చూసినా మద్యం బెల్టు షాపులే. ఫోన్‌ కొడితే ఇంటికే మద్యం డెలివరీ అవుతోంది. బైక్‌లు, ఆటోల్లో సంచార దుకాణాల్లోనూ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇనుము దొంగలు కోర్టులో సాక్ష్యాలను చోరీ చేయటమేంటి: ఆనం వెంకటరమణారెడ్డి
    నెల్లూరు కోర్టులో చోరీ ఘటన విచారణపై టీడీపీ అధికార ప్రతినిధి టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. సాక్ష్యాలు మాయం కావటంలో గుట్టు ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కాకాణిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పట్టపగలే సెల్​ఫోన్​​ టవర్​ను ఎత్తుకెళ్లిన దొంగల ముఠా!
    సాధారణంగా ఎక్కడైనా డబ్బు, బంగారం, వాహనాలు, విలువైన వస్తువులు చోరీకి గురవుతుంటాయి. అయితే కొందరు దొంగలు ఓ సెల్​ టవర్​ను దొంగలించారు. ఈ ఘటన బిహార్​లో జరిగింది. మరో ఘటనలో కొందరు వ్యక్తులు నకిలీ కాల్​ సెంటర్​ ఏర్పాటు చేసి విదేశాలకు చెందిన వారిని మోసం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ల్యాప్​టాప్​ బ్యాగ్​పై డౌట్.. చెక్ చేస్తే రూ.50కోట్ల డ్రగ్స్.. కిలో బంగారం మింగేసి..
    ముంబయి ఎయిర్​పోర్టులో రూ.50కోట్లు విలువైన డ్రగ్స్​ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అనుమానంతో డీఆర్ఐ అధికారులు ఇద్దరు ప్రయాణికుల బ్యాగ్​లను సోదా చేయగా 7.9 కేజీల హెరాయిన్​ పట్టుబడింది. మరోవైపు కేరళ విమానాశ్రమంలో ఓ వ్యక్తి వద్ద రూ.48.5 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జిన్​పింగ్​కు బిగ్​ షాక్​ ఇస్తూ కొవిడ్ లాక్​డౌన్​ నిరసనలు తీవ్రం
    జీరో కొవిడ్ పాలసీని వ్యతిరేకిస్తూ చైనాలో ఆందోళనలు పెరుగుతున్నాయి. వైరస్‌ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కమ్యూనిస్టు దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ ఆంక్షల పరిధిని అధికారులు విస్తరిస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గాలా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి!
    కొవిడ్‌ తర్వాత అందరికీ ఆరోగ్య బీమా పాలసీపై అవగాహన పెరిగింది. అయితే, ప్రీమియం ఖర్చును చూసి కొందరు వెనకడుగు వేస్తున్నారు. కానీ, కొన్ని మార్గాల ద్వారా ప్రీమియం మొత్తాన్ని తగ్గించుకునే వెసులుబాటు ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పరుగుల రాణి పీటీ ఉష!
    పరుగుల రాణి పీటీ ఉష మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకోనున్నారు. భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక లాంఛనమైంది. ఈ మేరకు అధ్యక్ష పదవికి నామినేషన్​ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎన్టీఆర్ ​ఒక్కో యాడ్​​కు ఎంత తీసుకుంటారో తెలుసా!
    'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్​. ప్రస్తుతం సినిమాలతో పాటు పలు యాడ్స్​లో​ కూడా నటిస్తున్నారు తారక్​. అయితే ఆయన చేస్తున్న యాడ్స్​కు రెమ్యునరేషన్​ ఎంత తీసుకుంటున్నారనే దానిపై ఓ చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆయన పారితోషికం ఎంతంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details