బయోపిక్కు సానియా సై - సానియా మీర్జా
హైదరాబాద్‌తో అనుబంధం, టెన్నిస్ ప్రస్థానం, షోయబ్ మాలిక్‌తో వివాహం... ఇలా సానియా జీవితంలోని కీలక ఘట్టాల సమాహారం త్వరలో చిత్రరూపంలో మన ముందుకు రానుంది.
బయోపిక్కు సానియా సై
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన బయోపిక్‌పై స్పందించింది. బాలీవుడ్ దర్శకుడు రోనీ స్క్రూనీవాలా దర్శకత్వంలో తన జీవితం తెరకెక్కుతుందని వెల్లడించింది. ఇప్పటికే సినిమా పనులు మొదలయ్యాయని తెలిపింది.
క్రీడాకారుల జీవితాలపై వచ్చిన చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. మేరీ కోమ్, దంగల్, బాగ్ మిల్కా బాగ్, ధోనీ చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సానియా బయోపిక్ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది.