విజయవాడలోని ప్రముఖ హోటల్లో వైతరుణి రాణా చిత్రం ట్రైలర్‌ను వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు విడుదల చేశారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో సినిమా చేయాలని ఆలోచన చేసి.. విజయవాడలో ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫామిలీ ఎలిమెంట్స్‌తో కూడుకొని ఉంటుందన్నారు. వైతరుణి రాణా చిత్రం మంచి విజయం సాధించాలని కోరారు. చిత్ర కధానాయకుడు శాంతిరాజ్ మాట్లాడుతూ సినిమా మొత్తం ఏపీలోనే షూట్ చేశామని....ఫ్యామిలీతో కలసి చూడదగ్గ సినిమా అన్నారు. ఇటువంటి చిన్న చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
'వైతరుణి రాణా' చిత్రం ట్రైలర్ విడుదల - movie
వైతరుణి రాణా చిత్రం ట్రైలర్‌ను వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు విడుదల చేశారు.
వైతరుణి రాణా చిత్రం ట్రైలర్ విడుదల