మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల తాజాగా నటిస్తున్న సినిమా "సూర్యకాంతం". "ముద్దపప్పు ఆవకాయ" ఫేం ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడు. ఈ సినిమాలో 'ఇంతేనా ఇంతేనా' అంటూ సాగే మొదటి పాట రేపు విడుదల కానుంది.
'సూర్యకాంతం' మొదటి పాట రేపే..
'సూర్యకాంతం' సినిమాలో 'ఇంతేనా ఇంతేనా' అంటూ సాగే మొదటి పాట రేపు విడుదల కానుంది.
నిహారిక
'ఈ మాయ పేరేమిటో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్నాడు. నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్ రాబిన్ సంగీతమందిస్తున్నారు. ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్లో లానే ఇందులోనూ అల్లరి పిల్లగా కనిపించనుంది నిహారిక. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.