రాహుల్ రామకృష్ణ. అర్జున్‌రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా నటించి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు... మంచి డైలాగ్ టైమింగ్ ఉన్న నటుడిగానూ పేరు పొందాడు. విలేకరిగా జీవితాన్ని మొదలుపెట్టి.. కథా రచయితగా, పాటల రచయితగా, నటుడిగా టాలీవుడ్లో మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన నట జీవితంలో మరో స్థానాన్ని చేరుకునేందుకు సిద్ధమయ్యాడు. హాలీవుడ్లో హీరోగా నటించాలన్న తన కలను తీర్చుకోబోతున్నాడు.
హాలీవుడ్ హీరోగా రాహుల్ రామకృష్ణ!
రాహుల్ రామకృష్ణ. అర్జున్‌రెడ్డి సినిమాలో హీరో స్నేహితుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. డైలాగ్ టైమింగ్ ఉన్న నటుడిగా పేరు పొందాడు. ఇప్పుడు హాలీవుడ్లో హీరోగా నటించాలన్న కల తీర్చుకోబోతున్నాడు.
Rahul ramakrishna4
తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతామన్న విశ్వాసం ఉందని ట్వీట్ చేశాడు.. రాహుల్ రామకృష్ణ. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని అభిమానులు, సన్నిహితులు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.