బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక చోప్రా. ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్ మేడమ్ టుస్సాడ్స్‌లో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సంబంధిత చిత్రాలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
"ఇది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ మైనపు విగ్రహంలో కనుబొమ్మలు ఎంతో నచ్చాయి"- ప్రియాంక చోప్రా.