ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

'కరోనా శాశ్వతంగా ఉండే సమస్యేం కాదు'

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్​డౌన్​తో అన్ని రంగాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. సినీ రంగం కూడా చిత్రీకరణ ఆపేసింది. దీని ప్రభావం పరిశ్రమపై ఎంత మేరకు ఉంటుందనే విషయాలను ఎంఎం కీరవాణి ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

By

Published : Apr 26, 2020, 9:01 PM IST

music-director-keeravani-about-corona-virus
ఎంఎం కీరవాణి

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈటీవీ భారత్ ముఖాముఖి

ప్ర: చిత్ర పరిశ్రమపై కరోనా చూపిన ప్రభావమెంత..?

జ: ఏదీ ఎల్లప్పుడూ శాశ్వతం కాదు. కరోనా ముందు తర్వాత అనేది ఏమీ ఉండదు. కొన్ని రోజుల్లో ప్రజలు కరోనాను మర్చిపోయే పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో ఎప్పుడూ కొత్త సమస్య వస్తూనే ఉంటుంది. ఎప్పటి సమస్య అప్పటిదే. కొత్త సమస్య వస్తే అది గొప్పగా కనిపిస్తుంది. కాబట్టి కరోనా సమస్య సమసిపోతుంది.

ప్ర: ఎక్కువ బడ్జెట్​ పెట్టి సినిమా తీస్తే.. భౌతిక దూరం దృష్ట్యా కరోనా కారణంగా థియేటర్లు నిండకపోతే ఇబ్బందే కదా..?

జ:మీరు సినీ పండితులు గురించి వినే ఉంటారు. ఇది మీరు వాళ్లని అడిగాల్సిన ప్రశ్న. నేను సంగీత దర్శకుణ్ని మాత్రమే..!

ప్ర:కరోనా తర్వాత కూడా భయంతో జనం థియేటర్లకు రాకపోతే నష్టమే కదా..?

జ: పొగ తాగడం అలవాటైన వారు ఒకవేళ ఉత్పత్తి ఆగిపోతే వేరే పద్ధతుల్లో దాన్ని ఆస్వాదిస్తారు. సినిమా అంటేనే వినోదం. వినోదం థియేటర్లలో దొరక్కపోతే మరోలా దొరుకుతుంది. అంతే తప్ప చిత్ర పరిశ్రమ ఆగిపోదు. మనిషి ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తాడు. సినీ పరిశ్రమనే నమ్ముకున్న వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ప్ర:మంచి హిట్​ సినిమాలకు సంగీతం అందించినప్పటికీ ఇంట్లో ఉండాల్సి వచ్చిందా?

జ: ఎవరికైనా ఇలాంటి పరిస్థితి తప్పదు. లాక్​డౌన్​ అంటే ఇంటికే పరిమితం కావడం. ఈ సమయంలో ఆదాయంపై ప్రభావం పడుతుంది. వృత్తిరీత్యా బయటకు వెళ్లలేం. ఇప్పుడు ఏ పనికీ బయటకు వెళ్లలేం. లాక్​డౌన్​ ఎలా చూస్తున్నామనే కోణంలోనే ఉంటుంది.

ప్ర:మారిన పరిస్థితుల దృష్ట్యా సినిమా ఎక్కడ చూస్తే బాగుంటుంది.. మీ అభిప్రాయం..?

జ:ఆఫ్షన్​ ఇస్తే ఎన్నైనా కోరుకుంటాం. మనకు ఏది బాగుంటుందే దాన్నే అనుసరిస్తాం. పరిశ్రమ కూడా దేనికైనా సర్దుకుంటుంది.

ఇదీ చూడండి:కెరీర్​ డౌన్​ అయినప్పుడల్లా.. నేను లాక్​డౌన్​లోనే!

ABOUT THE AUTHOR

...view details