ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / science-and-technology

రోబోకు మీ ముఖం ఇస్తే... 90 లక్షలు! - రోబోకు ఫేస్ ఇస్తే 90 లక్షలు న్యూస్

అచ్చం మనిషిలా కనిపిస్తూ అలాగే ప్రవర్తించే హ్యూమనాయిడ్‌ రోబోలను రోబో సినిమాలో మనం చూసే ఉంటాం. అలాంటి రోబోలు ఇప్పుడు మన ముఖంతోనూ మార్కెట్లోకి రావచ్చు. అందుకోసం మీకు డబ్బులు కూడా వస్తాయండి.

robo faces with human

By

Published : Nov 22, 2019, 4:04 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

మనిషిలా కనిపిస్తూ అలాగే ప్రవర్తించే హ్యూమనాయిడ్‌ రోబోలను రోబో సినిమాలో మనం చూశాం. ఇప్పుడు అవే రోబోలు మన ముఖంతోనూ మార్కెట్లోకి రావొచ్చు తెలుసా. అంతేకాదు, అలా మన ముఖాకృతిని రోబోకు వినియోగించినందుకుగాను ఏకంగా తొంభై లక్షల రూపాయల దాకా చెల్లిస్తోంది ఓ సంస్థ. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. వృద్ధులకు చేయూతగా ఉండేందుకు తయారు చేస్తున్న రోబోలకు వినియోగించేందుకు నిజమైన మనిషి ముఖం కావాలంటోంది జియోమిక్‌ అనే సంస్థ. ఎవరైనా ఈ సంస్థ మెయిల్‌ (faces@geomiq.com)కు తమ ఫొటో పంపొచ్చు. వచ్చిన వాటిలో ఒక ఫొటోను ఎంపిక చేసి ఆ ఆకృతిని వీళ్లు తయారు చేసే రోబోలకు ఉపయోగిస్తారు. ఇందుకు గాను మన ముఖానికి సంబంధించిన సర్వహక్కులూ ఇచ్చినందుకు పెద్ద మొత్తాన్ని ముట్టజెపుతారన్నమాట. ఇలాంటి సంస్థలు మరిన్ని పుడితే మనకూ ఓ కవల రోబో తమ్ముడో చెల్లెలో రాబోతున్నట్టే!

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details