ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

లాక్ డౌన్​తో బోర్ కొడుతోందా.. రంగుల చక్రం చేసేయండిలా..!

ప్చ్‌‌.. ఇళ్లంతా ఏదో వెలితిగా అనిపిస్తోంది కదూ! మరి.. ఇంకేం రంగుల హంగులు అద్దేద్దామా! ఎంచక్కా రంగుల చక్రాలు తయారు చేసి ఇంట్లో అక్కడక్కడా అతికించేద్దాం. ఇంకెందుకాలస్యం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం!

By

Published : Apr 29, 2020, 3:00 PM IST

colours wheel
రంగుల చక్రం

లాక్ డౌన్​తో ఇంట్లోనే ఉండి బోర్ కొడుతోందా.. టీవీ, ఫోన్ చూసీచూసీ విసుగొచ్చేసిందా.. అయితే ఈ రంగుల చక్రం తయారుచేయండి.. ఇంటిని అలంకరించుకోండి.. కాలక్షేపమూ అవుతుంది.. ఇళ్లు అందంగానూ ఉంటుంది.

కావాల్సిన వస్తువులు

1. అమ్మానాన్న సాయంతో రంగులు వేసి సిద్ధం చేసుకున్న ఐస్‌క్రీం పుల్లలు

2. పేపర్‌ ప్లేట్‌ లేదా థర్మాకోల్‌ ప్లేట్‌

3. జిగురు (గమ్‌)

రంగుల చక్రం

తయారీ విధానం

* పేపర్‌ లేదా థర్మాకోల్‌ ప్లేట్‌ తీసుకోండి. దాని మధ్యలో ఓ కప్పును పెట్టి.. దాని అంచుల వెంబడి నెమ్మదిగా పెన్నుతో గుండ్రంగా గీసుకోండి.

* ప్లేట్‌ మధ్యలో గుండ్రంగా పెన్ను గీత వెంబడి నెమ్మదిగా కత్తిరించి ఇమ్మని అమ్మానాన్నను అడగండి.

* ఇప్పుడు మధ్యలో రంధ్రంతో ప్లేట్‌ సిద్ధమవుతుంది. తర్వాత ప్లేట్‌ను బోర్లేయండి.

రంగుల చక్రం

* రంగులు వేసి సిద్ధంగా పెట్టుకున్న పుల్లల్ని చిత్రంలో చూపించినట్లు ప్లేట్‌కు జిగురు సాయంతో నెమ్మదిగా అతికించుకుంటూ రండి.

* కాసేపు దీన్ని ఆరనివ్వండి.

* ఇంట్లో షోకేస్‌ గ్లాసులకో.. తలుపులకో జిగురుతో కానీ పారదర్శక టేప్‌తో కానీ జాగ్రత్తగా అతికించుకోండి.

రంగుల చక్రం

* ఇలాంటివి ఎన్ని అవసరముంటే అన్ని తయారు చేసి పెట్టుకుని ఎంచక్కా అలంకరించుకోండి.

* తర్వాత వీటిని ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో అమ్మానాన్న సాయంతో అప్‌లోడ్‌ చేయండి. ‘అరె! భలే ఉందే’ అని కామెంట్లు, లైకుల మీద లైకులు రాకుంటే అడగండి!

రంగుల చక్రం

ఇవీ చదవండి.. తెలుగు హిట్ సినిమా గురించి భారత క్రికెటర్ల చర్చ

ABOUT THE AUTHOR

...view details