ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 1, 2020, 9:44 AM IST

ETV Bharat / lifestyle

కొత్త ఏడాదిలో ఇలా చేద్దాం.. ఆనందంగా ఉందాం!

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. డైరీలు.. క్యాలెండర్ల పేజీలు.. మారడం మాత్రమే కాదు. నూతన సంవత్సరం అంటే కొత్తగా ఆలోచించడం.. కొత్త ప్రణాళికలు, కొత్త పనులు ప్రారంభించడం ఇలాంటివి అనేకం ఉంటాయి. మరి దానికి యువత ఈ సంవత్సరం చేయాల్సిన పనులు ఏంటో చూద్దాం.

new-year-2020-new-goals
new-year-2020-new-goals

కొత్త సంవత్సరం... కొత్త జిందగీని స్టార్ట్​ చేద్దాం అనుకుంటారు. ఒకటి రెండ్రోజులు బాగానే ప్రయత్నం చేస్తాం... కానీ కొద్దిరోజులకు ఆచరణలో వైఫల్యం చెందుతాం. అలా కాకుండా.. ఈ ఏడాది యువత చేయాల్సిన పనులు ఏంటో చూద్దాం.

వ్యక్తిగత క్రమశిక్షణ:

యువత ఈ సంవత్సరం కచ్చితంగా తాము ఎలా ఉంటున్నామో గ్రహించుకోవాలి. ప్రధానంగా కోపం తగ్గించుకోవడం, ఇతరులతో బాగా ఉండాలనే నిర్ణయాలు తీసుకోవాలి. మన నడవడికను బట్టే అవతలి వ్యక్తులు మనతో మెలుగుతారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

అనవసర ఖర్చులు:

ముఖ్యంగా అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఒక వస్తువును కొంటున్నామంటే అది మనకు ఎంతవరకు అవసరమో గుర్తించాలి. డబ్బును పరిమితికి మించి వాడకూడదని గుర్తు పెట్టుకోవాలి.

చరవాణి వినియోగం:

ప్రస్తుతం యువత సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడుపుతున్నారు. సెల్ఫీలు దిగడం, చాటింగ్​ ఇతర వాటికి ఎక్కువ సమయమిస్తున్నారు. ఫలితంగా సమయం వృథా అవుతోంది. వీటికి ఈ ఏడాది కాస్త దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి.

సామాజిక సేవా కార్యక్రమాలు:

సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. వాటి వల్ల మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి చేస్తున్నామనే భావన మీకు ధైర్యాన్ని ఇస్తుంది.

వ్యాయామం చేయండి:

మన శరీరం ఫిట్​గా ఉంటే...మన ఆలోచనలు కూడా సరిగ్గా ఉంటాయి. అందుకే ఈ సంవత్సరం నుంచి వ్యాయమం మొదలుపెట్టండి. ఫిట్​గా ఉండండి. ఆనందాన్ని పంచండి.

ఇదీ చూడండి:

భారత​ తొలి సీడీఎస్​గా బిపిన్ ​రావత్ నియామకం

ABOUT THE AUTHOR

...view details