ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దోమలకి మనిషి రక్తమే ఎందుకు?

By

Published : Nov 2, 2020, 12:34 AM IST

దోమకాటు ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. అయితే దోమలూ ఈగల్లాంటి కీటకాలే కదా... కానీ అవి మనుషుల్ని ఎందుకు కుడతాయో తెలుసా?

దోమలకి మనిషి రక్తదోమలకి మనిషి రక్తమే ఎందుకు?మే ఎందుకు?
దోమలకి మనిషి రక్తమే ఎందుకు?

మనుషుల్ని కుట్టి రక్తం పీల్చేది ఆడదోమలే. మనిషి రక్తమే వాటికి రుచిస్తుంది. ఎందుకంటే- సంతానోత్పత్తికోసం గుడ్లు పెట్టేందుకు వాటికి పోషకాహారం అవసరం. అది మనిషి రక్తంలో దొరుకుతుందనీ అందుకే అవి కుడుతున్నాయనీ ద రాక్‌ఫెల్లర్‌ యూనివర్సిటీ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు జికా, చికెన్‌గున్యా వైరల్‌ జ్వరాలకు కారణమైన ఈడెస్‌ ఏజిప్టి అనే ఆడదోమని కూలంకషంగా పరిశీలించారట. కొన్ని ఆడదోమలకు అచ్చం రక్తం రుచితో ఉండే ఆహారాన్నీ, తేనెనీ ఆహారంగా అందిస్తే అవి తేనెని వదిలేసి, రక్తం దగ్గరకే వెళ్లి పీల్చసాగాయట. దీన్నిబట్టి అవి ఆహారంలో తేడాని గుర్తించగలవనీ, అందుకే అన్ని రకాల పోషకాలతో కూడిన మనిషి రక్తం రెడీమేడ్‌గా దొరుకుతుంది కాబట్టి గుడ్ల ఉత్పత్తికోసమే అవి మనుషుల్ని కుడుతున్నాయనీ చెబుతున్నారు సదరు పరిశోధకులు.

ABOUT THE AUTHOR

...view details