ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

ఆరోగ్యానికి ఆరు సూత్రాలు.. పాటిస్తే ఎన్నో ప్రయోజనాలు

ఇంటివంట అంటే ఎవరికి నచ్చకుండా ఉంటుంది... ఐతే, రుచికి దాసోహమై ఒక్కోసారి అదుపు లేకుండా తినేస్తూ ఉంటాం. ఫలితంగా బరువు పెరగడంతోపాటు ఇతర సమస్యలూ తలెత్తుతాయి. మరి ఇంట్లో ఆహారాన్ని పరిమితంగా తింటూ ఆరోగ్యంగా ఉండాలంటే... ఇవి పాటించాల్సిందే!

ఆరోగ్యానికి ఆరు సూత్రాలు.. పాటిస్తే ఎన్నో ప్రయోజనాలు
ఆరోగ్యానికి ఆరు సూత్రాలు.. పాటిస్తే ఎన్నో ప్రయోజనాలు

By

Published : Nov 2, 2020, 11:58 PM IST

  • ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇవి బరువు పెరుగుదలకు కారణమవుతాయి.
  • బ్రౌన్‌రైస్‌, బ్రౌన్‌ బ్రెడ్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. వీటిలోని సంక్లిష్ట పిండిపదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • జంక్‌ఫుడ్‌ అంటే వెంటనే నోరూరుతుంది. కానీ వాటితో ఆరోగ్య సమస్యలూ వస్తాయి. బదులుగా తాజా కాయగూరలు, పండ్లు, ఆకుకూరలకు ప్రాధాన్యం ఇస్తే సరి. గుడ్డు, పాలు, పెరుగు తీసుకున్నా మంచిదే.
  • నీళ్లు తాగడంవల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం మర్చిపోకండి.
  • తినేటప్పుడు టీవీ, సెల్‌ఫోన్‌ చూడొద్దు. తిండిపైనే దృష్టి పెట్టండి. రంగు, రుచి, వాసనను ఆస్వాదిస్తూ తింటేనే అది వంటపడుతుంది.
  • నిద్ర అలవాట్లు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవర్చుకోవాలి. అలాగే నిద్రకు గంట ముందు ఫోన్‌కు దూరంగా ఉంటే మంచిది.

ABOUT THE AUTHOR

...view details