ఫ్యాషన్ ప్రియులకోసం హైదరాబాద్ మహానగరంలో మరో ప్రదర్శన అందుబాటులోకి వచ్చింది. హైటెక్స్ నోవాటెల్ హోటల్లో 'డిజైనర్ లైబ్రరీ' పేరుతో ఏర్పాటు చేసిన రెండు రోజుల ఫ్యాషన్ ఎగ్జిబిషన్ కనువిందు చేస్తోంది. నటి భానుశ్రీ మెహరా, మోడల్ ఆషికా గౌతమ్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు.
డిజైనర్ లెహంగాలు, కాటన్ కళంకారి దుపట్టాలు, చిక్ వర్క్ చుడీదార్లు ఇలా ఒకటేమిటీ ఫ్యాషన్ రంగంలో ఉన్న అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ కొలువుదీరాయి. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు, ఆభరణాలు మహిళలను ఆకట్టుకుంటున్నాయి.