ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

యువకుడి హత్య....వివాహేతర సంబంధమే కారణం! - youth murdred

అనంతపురం జిల్లా వేల్పుమడుగు రహదారి పక్కన ఓ యువకుడు దారుణ హత్య గురయ్యాడు. సంఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు స్థానికులను విచారించారు. మృతుడు నాగలూరు గ్రామం వాసిగా గుర్తించి..విచారణ చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

యువకుడి హత్య....వివాహేతర సంబంధమే కారణం!

By

Published : May 31, 2019, 7:35 AM IST

యువకుడి హత్య....వివాహేతర సంబంధమే కారణం!
అనంతపురం జిల్లా బత్తలపల్లి సమీపంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ధర్మవరం మండలం నాగలూరు గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వేల్పుమడుగు వెళ్లే రహదారి పక్కన నరేష్ అనే వ్యక్తిని బండ రాళ్లతో కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ వెంకటరమణ ఘటనాస్థలిని పరిశీలించారు. స్థానికులను విచారించిన అనంతరం...వివాహేతర సంబంధం కోణంలో వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details