ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

గన్​తో బెదిరించి.. అత్యాచారం చేసి.. ఆపై..! - మైనర్​పై అత్యాచారం

ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా... ఎన్ని ఆందోళనలు జరిగినా అత్యాచారాలు మాత్రం ఆగడంలేదు. ఓ బాలికను బెదిరించి... అఘాయిత్యానికి పాల్పడి... ఆ దృశ్యాలను సెల్​ఫోన్​లో రికార్డు చేశాడు ఓ కామాంధుడు.

young man raped a girl at semshabad
బాలికపై అత్యాచారం

By

Published : Dec 22, 2020, 1:23 PM IST

హైదరాబాద్ శంషాబాద్​లో దారుణం చోటు చేసుకుంది. బాలికను బెదిరించి ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్​కు చెందిన గోపి శంషాబాద్​లో ఉంటున్నాడు. స్థానికంగా నివాసముండే​ బాలికను.. గన్ చూపించి బెదిరించాడు. ఆమె తల్లిదండ్రులను కాల్చేస్తానంటూ పలుమార్లు అత్యాచారం చేశాడు.

ఆ ఘటన దృశ్యాలను సెల్​ఫోన్​లో రికార్డు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెపితే.. చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. భయపడిన బాలిక విషయాన్ని ఎవరికి చెప్పలేకపోయింది. అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అసలు విషయం బయటపడింది. అనంతరం ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details