తెలంగాణ.. జోగులాంబ గద్వాల జిల్లా మనపాడు మండల కేంద్రంలో అత్తపై కోడలు దాడి చేసింది. అత్తపై కోపాన్ని ఆపుకోలేక.. ఏకంగా ముక్కునే కొరికేసింది. మంగలి జయన్న, శారదమ్మ భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. అన్నదమ్ముల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో చిన్న కోడలు రేవతి.. అత్త జయమ్మ ఇద్దరు ఇంట్లో గొడవ పడ్డారు. దీనితో కోడలు ఆగ్రహంతో.. అత్త ముక్కును కొరికింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి.. జయమ్మకు ఏడు కుట్లు వేశారు.
కోపంతో రగిలిన కోడలు... అత్త ముక్కు కొరికేసింది.. - woman bites her mother in law nose at gadwal district
కోపంతో రగిలిన ఓ కోడలు అత్త ముక్కుమీద ప్రతాపం చూపింది. మాటలు, చేతులతో కాకుండా.. ఏకంగా నోటికే పని చెప్పింది. అత్త ముక్కును కోడలు కొరికింది. ఈ ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో మనపాడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
woman-bites