ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఉద్యోగాల పేరుతో మోసం.. ముగ్గురు సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుళ్లు అరెస్ట్

సీఐఎస్​ఎఫ్​లో పని చేస్తున్న ఆ ముగ్గురు కానిస్టేబుళ్లు..ముఠాగా అవతారమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేయడం అలవాటు చేసుకున్నారు. ఇలా ఒక్కరిద్దరూ కాదు ఏకంగా 38మందికిపైగా బురిడీ కొట్టించారు. నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయల వసూళ్లు చేస్తున్న ఈ ముఠా...విశాఖ పోలీసులకు చిక్కింది. వీరిని మనోజ్ (పశ్చిమగోదావరి), వెంకటరమణ(విజయనగరం), హరిబాబు (శ్రీకాకుళం)లుగా గుర్తించారు.

three cisf constibels arrested
three cisf constibels arrested

By

Published : Nov 17, 2020, 8:31 PM IST

Updated : Nov 17, 2020, 8:37 PM IST

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల వద్ద నుంచి లక్షలు కాజేస్తున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముగ్గురు కూడా సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... విశాఖకు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి ప్రభుత్వ ఉద్యోగం పేరుతో పలు దఫాలుగా 9 లక్షల రూపాయలను వసూలు చేశారు. అయితే ఈ బాధితుడికి విశాఖ స్టీల్ ప్లాంట్​లో స్వతహాగా ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో ఈ ముగ్గురి కానిస్టేబుళ్ల వ్యవహారంపై సీఐఎస్​ఎఫ్​ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. శాఖ సంబంధిత విచారణ చేపట్టగా ముగ్గురు కానిస్టేబుళ్లను సీఐఎస్​ఎఫ్​ అధికారులు సస్పెండ్ చేశారని డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు.

ఈ ముఠా చేతిలో 38 మంది వరకు మోసపోయినట్లుగా ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. మధ్యప్రదేశ్​లో నకిలీ పరీక్ష నిర్వహించి...కొందరికీ నియామక పత్రాలను కూడా ఇచ్చినట్లు తెలిసిందని వివరించారు. ముగ్గురు నిందితులైన మనోజ్, వెంకటరమణ, హరిబాబు... హైదరాబాద్​లోని ఓ జాబ్ కోచింగ్ సెంటర్లలో పరిచయమైన వారందర్నీ మోసగించిట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి ముఠాల పట్ల నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలని డీసీపీ రస్తోగి హెచ్చరించారు. కష్టపడి చదవితేనే ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు.

Last Updated : Nov 17, 2020, 8:37 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details