అనంతపురం జిల్లా తాటిచెర్ల గ్రామంలో పుల్లారెడ్డి అనే రైతు హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన వెంకటేష్‌కు పుల్లయ్య, సుబ్రహ్మణ్యం, పుల్లారెడ్డి, రామయ్య నలుగురు కుమారులు. తండ్రికి సంబంధించిన 18 ఎకరాల భూమిని 15 ఏళ్ల క్రితమే పంచేసుకున్నారు. అయినప్పటికీ అన్నదమ్ముల మధ్య భూ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే పొలంలో పుల్లారెడ్డికి, అతని సోదరులకి మళ్లీ ఘర్షణ జరిగింది. సోదరులే పుల్లారెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యలో ఎవరెవరు పాల్గొన్నారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. హత్య వెనుక ఇంకా ఏవైనా కారాణాలు ఉన్నాయనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి కోసం సొంత సోదరుడిని హత్య చేసిన అన్నదమ్ములు
ఆస్తి కోసం ఇద్దరు వ్యక్తులు సొంత సోదరుడినే హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లా తాటిచెర్లలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి కోసం సొంత సోదరుడిని హత్య చేసిన అన్నదమ్ములు