ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ప్రేమగా చూసే భర్తను చంపలేక తనువు చాలించింది! - మామను పెళ్లి చేసుకోమ్మని కుమార్తెను వేధించిన తల్లి

బిడ్డ బాగు కోరాల్సిన తల్లి... తమ్ముడి సంతోషం కోసం అల్లుడిని కడతేర్చాలని చూసింది. భర్తను చంపమని కుమార్తెకు నూరిపోసింది. తనను ప్రేమగా చూసే భర్తను చంపేందుకు మనసొప్పక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌లో చోటు చేసుకుంది.

married-woman-suicide-because-of-her-mother-and-uncle-harassment
married-woman-suicide-because-of-her-mother-and-uncle-harassment

By

Published : Sep 14, 2020, 9:01 PM IST

కృష్ణా జిల్లాకు చెందిన రాములమ్మ కుమార్తె గాయత్రిని అదే ప్రాంతానికి చెందిన సైదారావు వివాహం చేసుకున్నాడు. రాములమ్మ తమ్ముడు పుల్లారావు భార్య అతడిని ఏడాది క్రితం వదిలేసింది. తన కుమార్తెను తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని రాములమ్మ భావించి అల్లుడిని చంపాలని కుమార్తెను వేధించారు. తనను ప్రేమగా చూసే భర్తను చంపేందుకు మనసు ఒప్పక గాయత్రి పురుగుల మందు తాగి తనువు చాలించింది.

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నేరేడ్​మెట్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినాథపురానికి చెందిన కత్తి రాములమ్మ కుమార్తె శనివారం ఆత్మహత్య చేసుకుంది. మొదట అందరూ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందేమోనని భావించారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు.. విచారణ చేపట్టగా.. మహిళ రాసిన లేఖ లభ్యమైంది. మహిళ ఆత్మహత్యకు తల్లి, మేనమామ వేధింపులే కారణమని లేఖలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని రిమాడ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details