ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మండపాకలో ఉద్రిక్తత... గ్రామంలో పోలీసుల పికెట్

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన శీలం రఘుబాబు అనే వ్యక్తిని దుండగులు హతమార్చిన ఘటనలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

మండపాకలో ఉద్రిక్తత

By

Published : May 13, 2019, 11:36 AM IST

మండపాకలో ఉద్రిక్తత

ఈ నెల 8 రాత్రి... పశ్చిమగోదావరి జిల్లాలోని పెంటపాడు మండలం పత్తిపాడు వద్ద శీలం రఘుబాబు అనే వ్యక్తిని కొందరు అగంతకులు పెట్రోలు పోసి నిప్పుపెట్టారు. ఈ విషయమై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆధారాల ప్రకారం మృతుడు శీలం రఘుబాబుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు పెద్ద సంఖ్యలో గ్రామానికి చెరుకున్నారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెట్‌లు ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రఘుబాబు తనకుతానుగా బయటికి వెళితే మార్గమధ్యంలో ఆపి దుండగులు దురాగతానికి పాల్పడ్డారా? లేక ఇంటివద్ద ఉంటే పిలిపించి దుశ్చర్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

జరిగిందేంటి!

మే 8 నుంచి మండపాక గ్రామానికి చెందిన రఘుబాబు కనిపించడం లేదని ఆయన కుటుంబసభ్యులు తణుకు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘుబాబు అదృశ్యమైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పత్తిపాడు వద్ద పెట్రోలు పోసి తగులబెట్టిన శవం రఘుబాబుదేనని ఆయన బంధువులు గుర్తించారు. అనంతరం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన కారణంగా బందోబస్తు పెంచారు.

ఇవీ చూడండి ; సెల్​ఫోన్ మిస్సైంది... ఆరుగురికి గాయాలయ్యాయి!

ABOUT THE AUTHOR

...view details