మంచం అమ్మకానికి పెట్టి.. ఓ మహిళ రూ.లక్షా ఐదు వేలు రూపాయాలు పోగొట్టుకున్నారు. హైదరాబాద్ బోయినపల్లికి చెందిన శ్రీదుర్గ ఓఎల్ఎక్స్లో మంచం అమ్మకానికి పెట్టారు. ఆ ప్రకటన చూసి.. ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తాను ఆర్మీ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. మంచం నచ్చిందని.. రూ.20వేలకు బేరం కుదుర్చుకున్నాడు. నా చిరునామా మీకు పంపిస్తాను.. మంచం పంపించండి అని నమ్మించాడు. డబ్బులు అన్లైన్లో వేస్తానన్నాడు. క్యూఆర్ కోడ్ పంపిస్తాను. దాన్ని స్కాన్ చేస్తే.. డబ్బులు మీ ఖాతాలో పడతాయని నమ్మించాడు. నిజమే అని నమ్మిన శ్రీదుర్గ.. అతను పంపించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారు. క్షణాల్లో ఆమె ఖాతాలోని లక్షా ఐదు వేలు మాయమయ్యాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి స్విచాఫ్ చేశాడు. మోసపోయానని గుర్తించిన సదరు బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మంచం అమ్మకానికి పెట్టి.. రూ.లక్ష మోసపోయిన మహిళ - హైదరాబాద్ వార్తలు
ఆన్లైన్లో మంచం అమ్మకానికి పెట్టి.. హైదరాబాద్కు చెందిన మహిళ లక్ష రూపాయలు మోసపోయిన ఘటన బోయిన్పల్లిలో చోటు చేసుకుంది. ఆన్లైన్ అమ్మకంలో మోసపోయానని తెలుసుకున్న ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
మంచం అమ్మకానికి పెట్టి.. రూ.లక్ష మోసపోయిన మహిళ