ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ప్రమాదవశాత్తు నీటికుంటలో పడిన కారు.. చిన్నారి మృతి - కర్నూలు జిల్లా ప్రమాదాలు

నీటి కుంటలో కారు ప్రమాదవశాత్తు పడిన ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందింది. తమ్ముడు, బాబాయి​తో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన కర్నూలు జిల్లా గుత్తి సమీపంలో చోటుచేసుకుంది.

car-accident-in-
car-accident-in-

By

Published : Dec 3, 2020, 11:47 AM IST

Updated : Dec 3, 2020, 11:54 AM IST

ప్రమాదవశాత్తు నీటికుంటలో పడిన కారు.. చిన్నారి మృతి

నీటి కుంటలో కారు పడి.. బాలిక మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. గుత్తి సమీపంలోని చెర్లోపల్లి నుంచి బేతంచర్లకు వెళుతుండగా..ఆర్ కొత్తపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కా, తమ్ముడు అయిన కారుణ్య(9), కౌశిక్​ను... బాబాయి రవికుమార్ బేతంచర్లకు కారులో తీసుకువెళ్తున్నారు.

కొత్తపల్లి వద్ద ప్రమాదవశాత్తు.. నీటి కుంటలో కారు పడిపోయింది. కౌశిక్, రవికుమార్ కారులోంచి ప్రాణాలతో బయటపడ్డారు. కారుణ్య కారులోనే మృతి చెందింది. స్థానికులు కారును, బాలికను బయటకు తీశారు.

Last Updated : Dec 3, 2020, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details