తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్చుకున్న ఘటన కలకలం రేపింది. బాహ్య వలయ రహదారిపై టీఎస్ 09 యూబీ 6040 సంఖ్యగల బెంజ్ కారులో వచ్చిన ఫైజాన్ అహ్మద్ అనే వ్యక్తి తనకు తానే తుపాకీతో కాల్చుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడు లోయర్ ట్యాంక్ బండ్ వాసిగా పోలీసులు గుర్తించారు. యూఎస్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హుటాహుటిన రాయదుర్గంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.
ఔటర్ రింగ్‌రోడ్డుపై తుపాకీతో కాల్చుకున్న వ్యక్తి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మంచిరేపుల బాహ్యవలయ రహదారిపై యూఎస్ కన్సల్టెన్సీకి చెందిన ఫైజాన్ అహ్మద్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకుని గాయపరుచుకున్నాడు. బాధితుడిని రాయదుర్గంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు.
ఔటర్ రింగ్‌రోడ్డుపై తుపాకీతో కాల్చుకున్న వ్యక్తి