పదో తరగతి పరీక్షలో ఫైయిల్ అయిందని మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది ఓ విద్యార్థిని. కర్నూలు నగరంలోని గణేష్ నగర్‌కు చెందిన ప్రభావతి అనే విద్యార్ధిని లెక్కల సబ్జెక్టులో ఫెయిలయ్యింది. మళ్లీ పరీక్ష రాసేందుకు శనివారం వెళ్లి సప్లిమెంటరీ ఫీజు చెల్లించింది. తిరిగి ఇంటికి వచ్చింది. సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యలు వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పదో తరగతి ఫెయిలయ్యిందని...విద్యార్థి ఆత్మహత్య - విద్యార్థి
పదో తరగతిలో ఫెయిలయ్యిందని ఓ విద్యార్థి ప్రాణాలు బలితీసుకుంది. పరీక్ష మళ్లీ రాసేందుకు సప్లిమెంటరీ ఫీజు చెల్లించిన రోజే ఆత్మహత్య చేసుకుంది.
పదో తరగతి ఫెయిలయ్యిందని...విద్యార్థి ఆత్మహత్య