ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / international

నేషనల్​ ఎమర్జెన్సీ వైపు ట్రంప్​ అడుగులు

అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి జాతీయ అత్యవసర స్థితి వైపు ట్రంప్​ చర్యలు

trump

By

Published : Feb 3, 2019, 6:20 AM IST

trump
అక్రమ వలసల నివారణకు అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ జాతీయ అత్యవసర స్థితి విధించడానికి అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక అధికారాలతో గోడ నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించాలనే ఆలోచలనలో ఉన్నారు ట్రంప్​. అత్యవసర స్థితితో చట్టసభ​ ఆమోదం లేకుండానే గోడకు నిధులు కేటాయించే అవకాశం లభిస్తుంది. విపత్తు నిర్వహణ నిధులనూ గోడ నిర్మాణం కోసం ఉపయోగించుకునేందుకు ట్రంప్‌కు ప్రత్యేకాధికారాలు ఉంటాయి.
సరిహద్దు గోడ నిర్మాణంపై ప్రతిపక్ష డెమోక్రటిక్​ నాయకులతో చర్చలు సమయం వృథా తప్పా ప్రయోజనం లేదని సీబీఎస్​ న్యూస్​ 'ఫేస్​ ది నేషన్'​ కార్యక్రమంలో ట్రంప్​ పేర్కొన్నారు.

"మేము నేషనల్​ ఎమర్జెన్సీ విధించాలని చూస్తున్నాం. ఎందుకంటే అనుకూలంగా ఏదైనా జరగతుందని నేను అనుకోవట్లేదు. డెమోక్రాట్లకు సరిహద్దు రక్షణ అవసరం లేదనుకుంటున్నా. గోడలు అనైతికమైనవి, పని చేయవని వారు మాట్లాడటం విన్నాను. కానీ అవి పనిచేస్తాయని వారికి తెలుసు. గోడ నిర్మాణానికి మంచి అవకాశం ఉందని అనుకుంటున్నా."
- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి చెడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ట్రంప్​ ఆరోపించారు. సరిహద్దులో భద్రతా పెంచాల్సిన అవసరం ఉందని ఆమెకు తెలిసినా ఆ విషయం పట్టించుకోవట్లేదన్నారు. అక్రమ వలసదారులపై ఎవరికీ పట్టింపులేదని, మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించి తీరుతామన్నారు. దానివల్లే అక్రమ వలసదారులు దేశంలోకి రాకుండా ఆపగలమని ట్రంప్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

సరిహద్దు రక్షణకు 2500 మంది పోలీసులను పంపినట్లు తెలిపారు. వారి సేవలను ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details