ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / elections

2014తో పోల్చుకుంటే..పోలింగ్ ఎంత పెరిగింది ! - undefined

రాష్ట్రంలో 2014 ఎన్నికలతో పోలిస్తే...ఈసారి పోలింగ్ ఎక్కువగా నమోదైంది. మెుత్తం 175 శాసనసభ నియోజకవర్గాలకు 2014 ఎన్నికల్లో 78.41 శాతం పోలింగ్ నమోదు అవ్వగా...2019 ఎన్నికల్లో 79.64 శాతం నమోదైంది. అంటే ఈసారి 1.23 శాతం పోలింగ్ అధికం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ నమోదైన తీరు గత ఎన్నికలతో పోల్చి చూస్తే...

2014తో పోల్చుకుంటే..పోలింగ్ ఎంత పెరిగిందో తెలుసా!

By

Published : Apr 13, 2019, 5:41 AM IST

Updated : Apr 13, 2019, 1:18 PM IST

శ్రీకాకుళం జిల్లా....

నియోజకవర్గం 2014 2019
ఇచ్చాపురం 71.58 70.15
పలాస 71.90 72.92
టెక్కలి 77.82 78.79
పాతపట్నం 73.26 70.35
శ్రీకాకుళం 71.88 70.01
ఆముదాలవలస 76.60 78.51
ఎచ్చెర్ల 82.43 84.30
నరసన్నపేట 78.73 80.00
రాజాం 73.81 73.85
పాలకొండ 71.83 73.68
మెుత్తం 74.99 75.14

* 2014తో పోల్చుకుంటే..ఈసారి జిల్లాలో 0.15 శాతం పోలింగ్ పెరిగింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో తక్కువగా 70.01 శాతం నమోదవ్వగా...ఎచ్చెర్ల నియోజకవర్గంలో అధికంగా 84.30 శాతం పోలింగ్ నమోదైంది.

విజయనగరం జిల్లా

నియోజకవర్గం 2014 2019
కురుపాం 75.33 77.38
పార్వతీపురం 74.47 76.78
సాలూరు 76.76 79.00
బొబ్బిలి 79.11 79.27
చీపురుపల్లి 81.07 83.07
గజపతినగరం 85.21 86.73
నెల్లిమర్ల 87.68 87.79
విజయనగరం 71.40 70.88
శృంగవరపు కోట 85.18 85.92
మెుత్తం 79.58 80.68

* విజయనగరం జిల్లాలో కిందటిసారి కంటే 1.09 పోలింగ్ అధికంగా నమోదైంది. విజయనగరం నియోజకవర్గంలో అత్యల్పంగా 70.88 శాతం పోలింగ్ నమోదవ్వగా...నెల్లిమర్లలో అధికంగా 87.79 శాతం నమోదైంది.

విశాఖపట్నం జిల్లా

నియోజకవర్గం 2014 2019
భీమిలి 75.06 73.90
విశాఖపట్నం తూర్పు 64.43 64.73
విశాఖపట్నం దక్షిణం 65.51 61.15
విశాఖపట్నం ఉత్తరం 59.73 62.65
విశాఖపట్నం పశ్చిమం 59.93 58.19
గాజువాక 64.69 65.33
చోడవరం 84.48 84.26
మాడుగల 84.46 83.59
అరకు 69.58 70.45
పాడేరు 59.37 61.80
అనకాపల్లి 78.54 77.54
పెందుర్తి 77.98 74.74
యలమంచిలి 85.46 84.49
పాయకరావుపేట 80.54 81.74
నర్సీపట్నం 81.75 82.33
మెుత్తం 71.97 71.81

* విశాఖ జిల్లాలో గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ -0.16 శాతం పడిపోయింది. రాష్టంలోనే అత్యల్ప ఓటింగ్​ విశాఖ పశ్చిమలోనే నమోదైంది. జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గంలో అధికంగా 84.49 శాతం పోలింగ్ నమోదైంది.

తూర్పుగోదావరి జిల్లా...

నియోజకవర్గం 2014 2019
తుని 81.05 82.28
ప్రత్తిపాడు 79.94 80.92
పీఠాపురం 79.03 80.99
కాకినాడ గ్రామీణం 73.70 74.12
పెద్దాపురం 76.77 81.39
అనపర్తి 85.64 87.48
కాకినాడ పట్టణం 67.05 66.38
రామచంద్రాపురం 87.48 87.11
ముమ్మడివరం 82.83 83.51
అమలాపురం 77.58 82.46
రాజోలు 77.18 79.44
గన్నవరం 77.52 83.03
కొత్తపేట 83.78 84.30
మండపేట 87.22 85.52
రాజానగరం 85.63 87.47
రాజమహేంద్రవరం సిటి 68.64 66.34
రాజమహేంద్రవరం రూరల్ 73.44 73.45
జగ్గంపేట 83.39 85.88
రంపచోడవరం 75.52 78.04
మెుత్తం 78.99 80.08

*తూర్పుగోదావరి జిల్లాలో గత ఎన్నికలతో పోల్చుకుంటే... 2019 ఎన్నికల్లో 1.09 పోలింగ్ అధికంగా నమోదైంది. అత్యల్పంగా రాజమహేంద్రవరం సిటిలో 66.34 శాతం పోలింగ్ నమోదవ్వగా..అధికంగా 87.48 శాతం అనపర్తిలో నమోదైంది.

పశ్చిమ గోదావరి జిల్లా..

నియోజకవర్గం 2014 2019
కొవ్వూరు 84.82 86.17
నిడదవోలు 85.32 87.13
ఆచంట 81.37 81.46
పాలకొల్లు 82.64 81.55
నర్సాపురం 83.32 82.09
భీమవరం 77.68 77.60
ఉండి 86.14 84.73
తణుకు 81.27 80.00
తాడేపల్లిగూడెం 81.00 80.43
ఉంగుటూరు 86.16 86.86
దెందులూరు 86.61 84.70
ఏలూరు 70.59 67.59
గోపాలపురం 86.63 86.71
పోలవరం 85.56 86.55
చింతలపూడి 84.00 81.83
మెుత్తం 82.79 82.19

* పశ్చిమగోదావరి జిల్లాలో రాష్టంలోనే అధికంగా ఓటింగ్ శాతం పడిపోయింది. -0.60 శాతం ఈ ఎన్నికల్లో పోలింగ్ తగ్గింది. జిల్లాలోని ఏలూరు నియోజకవర్గంలో అత్యల్ఫంగా 67.59 శాతం పోలింగ్ నమోదైంది. నిడదవోలు 87.13 శాతం అధికంగా పోలింగ్ జరిగింది.

కృష్ణా జిల్లా

నియోజకవర్గం 2014 2019
తిరువూరు 86.69 86.77
నూజివీడు 87.43 86.83
గన్నవరం 86.31 85.29
గుడివాడ 79.78 80.20
కైకలూరు 86.12 88.05
పెడన 85.95 86.92
మచిలీపట్నం 76.2 79.77
అవనిగడ్డ 84.84 88.11
పామర్రు 87.81 87.44
పెనమలూరు 79.84 79.90
విజయవాడ వెస్ట్‌ 64.83 66.12
విజయవాడ సెంట్రల్‌ 65.24 65.78
విజయవాడ ఈస్ట్ 66.03 67.55
మైలవరం 85.61 83.48
నందిగామ 84.90 88.01
జగ్గయ్యపేట 89.00 89.64
మెుత్తం 80.15 81.12

* జిల్లాలో ఈ ఎన్నికల్లో 0.97 శాతం పోలింగ్ పెరిగింది. విజయవాడ వెస్ట్​లో సెంట్రల్ నియోజకవర్గంలో అత్యల్పంగా...65.78 శాతం నమోదవ్వగా...అధికంగా జగ్గయపేటలో 89.64 శాతం నమోదైంది.

గుంటూరు జిల్లా

నియోజకవర్గం 2014 2019
పెదకూరపాడు 88.93 88.23
తాడికొండ 88.84 85.77
మంగళగిరి 85.24 85.45
పొన్నూరు 84.49 82.95
వేమూరు 85.61 87.53
రేపల్లె 83.56 82.83
తెనాలి 79.33 77.47
బాపట్ల 82.65 82.58
ప్రత్తిపాడు 85.20 84.21
గుంటూరు పశ్చిమం 65.00 65.68
గుంటూరు తూర్పు 68.12 69.99
చిలకలూరిపేట 85.90 85.51
నరసరావుపేట 83.64 81.50
సత్తెనపల్లి 84.55 87.77
వినుకొండ 85.96 88.12
గురజాల 81.14 83.52
మాచర్ల 80.84 84.41
మెుత్తం 81.89 82.37

* జిల్లాలో 0.49 శాతం పోలింగ్ శాతం పెరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అత్యల్పంగా 65.68 శాతం నమోదవ్వగా...అధికంగా..పెదకూరపాడులో 88.23 శాతం నమోదైంది.

ప్రకాశం జిల్లా

నియోజకవర్గం 2014 2019
యర్రగొండపాలెం 83.34 87.23
దర్శి 90.96 89.62
పర్చూరు 87.66 87.56
అద్దంకి 89.70 89.82
చీరాల 81.01 83.76
సంతనూతలపాడు 82.78 83.86
ఒంగోలు 76.46 84.02
కందుకూరు 88.25 88.86
కొండెపి 84.81 87.09
మార్కాపురం 80.97 85.22
గిద్దలూరు 81.44 81.89
కనిగిరి 75.92 82.23
మెుత్తం 83.55 85.93

* ప్రకాశం జిల్లాలో 2.38 శాతం పోలింగ్ పెరిగింది. అధికంగా పోలింగ్ నమోదైన నియోజకవర్గం కూడా ఈ జిల్లాలోనిదే..అద్దంకిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 89.82 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని గిద్దలూరులో అత్యల్పంగా 81.89 శాతం నమోదైంది.

నెల్లూరు జిల్లా....

నియోజకవర్గం 2014 2019
కావలి 79.01 76.19
ఆత్మకూరు 78.08 82.44
కోవూరు 80.17 77.92
నెల్లూరు నగరం 57.02 65.42
నెల్లూరు రూరల్ 60.14 65.16
సర్వేపల్లి 84.90 82.42
గూడూరు 77.83 78.12
సూళ్లూరుపేట 77.95 82.86
వెంకటగిరి 81.17 78.63
ఉదయగిరి 77.15 79.48
మెుత్తం 74.84 76.68

* కిందటి ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో జిల్లాలో 1.84 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని సూళ్లూరుపేటలో అత్యధికంగా...82.86 శాతం పోలింగ్ నమోదవ్వగా..నెల్లూరు రూరల్​లో అత్యల్పంగా 65.16 శాతం నమోదైంది.

కడప జిల్లా...

నియోజకవర్గం 2014 2019
బద్వేలు 72.48 77.64
రాజంపేట 78.11 76.07
కడప 59.05 62.14
కోడూరు 77.33 75.29
రాయచోటి 75.68 75.96
పులివెందుల 79.86 80.87
కమలాపురం 83.95 82.58
జమ్మలమడుగు 85.62 85.40
ప్రొద్దుటూరు 77.88 76.67
మైదుకూరు 83.90 82.60
మెుత్తం 76.83 77.21

* కడప జిల్లాలో 0.37 శాతం ఓటింగ్ పెరిగింది. కడప నియోజకవర్గంలో అత్యల్పంగా 62.14 శాతం నమోదవ్వగా...జమ్మలమడుగులో అత్యధికంగా 85.40 శాతం నమోదైంది.

కర్నూలు జిల్లా

నియోజకవర్గం 2014 2019
ఆళ్లగడ్డ 78.31 84.26
శ్రీశైలం 80.67 82.54
నందికొట్కూరు 78.30 86.98
కర్నూలు 58.27 59.53
పాణ్యం 71.74 74.41
నంద్యాల 71.33 76.81
బనగానపల్లె 82.46 80.48
డోన్‌ 73.34 78.94
పత్తికొండ 78.80 83.97
కోడుమూరు 74.56 78.77
ఎమ్మిగనూరు 74.47 79.15
మంత్రాలయం 78.02 84.98
ఆదోని 65.28 65.31
ఆలూరు 75.97 79.71
మెుత్తం 74.02 77.68

* రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 3.65 శాతం పోలింగ్ పెరిగింది. కర్నూలు అసెంబ్లీ స్థానంలో అత్యల్పంగా 59.53 శాతం పోలింగ్ నమోదవ్వగా...నందికొట్కూరులో అత్యధికంగా 86.98 శాతం నమోదైంది.

అనంతపురం జిల్లా

నియోజకవర్గం 2014 2019
రాయదుర్గం 85.10 86.02
ఉరవకొండ 85.41 86.20
గుంతకల్ 74.11 75.78
తాడిపత్రి 79.64 81.25
శింగనమల 83.76 84.44
అనంతపురం అర్బన్ 60.51 63.18
కల్యాణదుర్గం 85.43 86.75
రాప్తాడు 83.97 82.33
మడకశిర 83.91 88.37
హిందూపురం 76.23 77.60
పెనుకొండ 82.99 86.99
పుట్టపర్తి 81.58 85.36
ధర్మవరం 84.02 86.50
కదిరి 74.91 79.95
మెుత్తం 79.71 81.90

* అనంతపురం జిల్లాలో 2.19 శాతం పోలింగ్ పెరిగింది. మడకశిరలో అధికంగా 88.37 శాతం పోలింగ్ అవ్వగా...అనంతపురం అర్బన్​లో 63.18 శాతం అత్యల్పంగా నమోదైంది.

చిత్తూరు జిల్లా

నియోజకవర్గం 2014 2019
తంబళ్లపల్లి 81.71 84.00
పీలేరు 78.34 77.10
మదనపల్లె 69.61 73.44
పుంగనూరు 83.72 85.15
చంద్రగిరి 79.35 78.18
తిరుపతి 59.02 66.05
శ్రీకాళహస్తి 80.18 81.81
సత్యవేడు 82.95 86.09
నగరి 84.73 86.22
గంగాధర నెల్లూరు 84.02 85.86
చిత్తూరు 75.15 79.34
పూతలపట్టు 85.32 85.52
పలమనేరు 84.32 86.12
కుప్పం 83.80 85.47
మెుత్తం 78.74 81.03

* చిత్తూరు జిల్లాలో 2.30 శాతం పోలింగ్ పెరిగింది. నగరి నియోజకవర్గంలో అధికంగా 86.22 పోలింగ్ నమోదవ్వగా...మదనపల్లెలో అత్యల్పంగా 73.44 శాతం నమోదైంది.

ఎంత మంది ఓటేశారంటే...

కిందటి ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఓటర్ల అధికంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. 2014 లో 2 కోట్ల 87 లక్షల 91వేల 613 ఓట్లు పోలవ్వగా...2019 ఎన్నికల్లో 3 కోట్ల 13 లక్షల 33వేల 631 ఓట్లు పోలయ్యాయి. 25 లక్షల 42 వేల 18 మంది అధికంగా ఈసారి ఓటింగ్​లో పాల్గొన్నారు.

ఓటేత్తిన నారీమణులు...

2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో మహిళా ఓటర్లలో చైతన్యం పెరిగింది. కిందటి ఎన్నికల కంటే ఈసారి అధికంగా మహిళలు పోలింగ్​లో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో కోటి 84 లక్షల 63వేల 770 మంది ఓటు వినియోగించుకోగా...2019 ఎన్నికల్లో కోటి 98 లక్షల 79 వేల 421 మంది మహిళలు ఓటింగ్​లో పాల్గొన్నారు.

Last Updated : Apr 13, 2019, 1:18 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details