ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

YOUNGMAN SUSPICIOUS DEATH: స్నేహితులతో విహారయాత్రకెళ్లి.. అలా తిరిగొచ్చాడు..! - విశాఖ తాజా నేర వార్తలు

MAN MURDER AT VISHAKA: విశాఖపట్నం జిల్లా గెద్దలపేటకు చెందిన శివ మూడ్రోజుల క్రితం విహారయాత్రకు వెళ్లి.. అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి మృతదేహం ఈ రోజు గ్రామానికి చేరింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. తమ కుమారుడితో విహారయాత్రకు వెళ్లిన వారే అతడిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

YOUNGMAN SUSPICIOUS DEATH AT VISHAKA
స్నేహితులతో విహారయాత్రకెళ్లి.. శవంగా ఎలా తిరిగొచ్చాడు..!

By

Published : Nov 26, 2021, 2:09 PM IST

YOUNGMAN SUSPICIOUS DEATH: విహారయాత్రకని తీసుకెళ్లి.. అతడి స్నేహితులే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారంటూ బంధువులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం గెద్దలపేటలో జరిగింది. తమ కుమారుడి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

అసలేం జరిగింది..?

గెద్దలపేటకు చెందిన శివ(19) మూడ్రోజుల క్రితం స్నేహితులతో కలిసి విహారయాత్రకు బయలుదేరాడు. తాను పనిచేస్తున్న యజమానితో కలిపి మొత్తం ఆరుగురు రాయగడకు వెళ్లారు. తర్వాత రోజు ఐదుగురు ఇంటికి చేరుకోగా... శివ మాత్రం రాలేడు. విషయం తెలుసుకున్న శివ తల్లిదండ్రులు.. అతడి స్నేహితులను కలిసి తమ కుమారుడు ఎక్కడికి వెళ్లాడు, ఎందుకు రాలేడంటూ ప్రశ్నించారు. శివ తన బంధువుల ఇంటికి వెళ్లాడు.. అందుకే మేం ఐదుగురు వచ్చేశామని స్నేహితులు వివరించారు.

కుమారుడొస్తాడనుకుంటే.. చావు కబురొచ్చింది..!

కుమారుడు ఇంటికెప్పుడొస్తాడంటూ వేచి చూస్తున్న తల్లిదండ్రులకు ఈరోజు ఉదయం... శివ చనిపోయినట్లు సమాచారం అందింది. స్నేహితులతో విహార యాత్రకు వెళ్లిన తమ కుమారుడు.. అనంత వాయువుల్లో కలిసిపోయాడన్న వార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. శివను స్నేహితులే విహారయాత్రకు తీసుకెళ్లి... అక్కడే హత్య చేసి తిరిగొచ్చారని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదంటూ గ్రామంలోనే ఆందోళన చేస్తున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శివ మృతికి గల కారణాలు తెలిసే వరకు తల్లిదండ్రులు, బంధువులు ఆగాలని సూచించారు. కచ్చితంగా నిందితులను పట్టుకొని.. వారికి కఠిన శిక్ష అమలయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో ఆందోళన విరమించిన తల్లిదండ్రులు... అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చూడండి:student died by snake: కాటేసిన పాము.. కట్టుకట్టి నిద్రపుచ్చిన ఆయమ్మ

ABOUT THE AUTHOR

...view details