ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తాడిపత్రిలో వైకాపా నాయకుడి హత్య

ycp-leadr-pothulaiah-murder-in-tadipathri
తాడిపత్రిలో వైకాపా నాయకుడి హత్య

By

Published : Sep 5, 2021, 9:40 AM IST

Updated : Sep 5, 2021, 3:22 PM IST

09:38 September 05

పెన్నా నదిలో పోతులయ్య మృతదేహం గుర్తింపు

పెన్నా నదిలో పోతులయ్య మృతదేహం గుర్తింపు


అనంతపురం జిల్లా తాడిపత్రి శివారులో వైకాపా నాయకుడు హత్యకు గురయ్యాడు. హత్య గురైన వ్యక్తి వాల్మీకి నాయకుడు గన్నెవారిపల్లి కాలనీ మాజీ సర్పంచ్ పోతులయ్యగా గుర్తించారు. మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. చాలా ఏళ్లుగా పోతులయ్య తెలుగుదేశం పార్టీలో ఉంటూ 20 ఏళ్ల క్రితం తెదేపా తరఫున సర్పంచ్‌గా గెలుపొందారు. మూడేళ్ల క్రితం నుంచి జేసీ సోదరులతో ఉన్న విబేధాలతో ఆయన వైకాపాలో చేరారు. 

నిన్న సాయంత్రం ఇంటి వద్ద నుండి బయటకెళ్లిన పోతులయ్య రాత్రికి ఇంటికి రాకపోవడంతో బంధువులు గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. పోతులయ్య చరవాణి సిగ్నల్స్ ఆధారంగా అతడు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు గుర్తించి వెతుకుతుండగా మృతదేహం లభ్యమైంది. ఆయన మర్మాంగం కోసి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, వైకాపా, తెదేపా నాయకులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని జాగిలాల సాయంతో నిందితుల ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసును చేధించేందుకు దర్యాప్తు చేపట్టిన్నట్లు సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు.

ఇదీ చూడండి:స్నేహితుల మధ్య ఘర్షణ.. కత్తెరతో మెడపై దాడి..

Last Updated : Sep 5, 2021, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details