తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో బాలుడి అదృశ్య ఘటన విషాదంతమైంది(Tragedy in Rajendra nagar). ఆరేళ్ల అన్వేష్ ఆడుకుంటానని చెప్పి గురువారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్ నుంచి కిందకి వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు... చుట్టుపక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.... చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. బాలుడు ఒక్కడే కాలినడకన వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మూడు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలించగా.. ఇంటికి సమీపంలోని చెరువులో అన్వేష్ మృతదేహం(boy died in Rajendra nagar) లభ్యమైంది. బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
శోకసంద్రంలో తల్లిదండ్రులు
బ్యాటరీ బైక్ రాలేదని బాలుడు మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం హైదర్‌గూడ సిరిమల్లెకాలనీలో అన్వేష్ అదృశ్యమయ్యాడు. రెండ్రోజుల క్రితం బ్యాటరీ బైక్ కావాలని అన్వేష్ కోరినట్లు అతడి తండ్రి తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చామని.. రెండురోజుల్లో వస్తుందని.. కానీ బాలుడు ఇకలేడని ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. బాలుడి మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏం జరిగింది?