ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

కాలుపై అరగంటకు పైగా ఆర్టీసీ బస్సు.. నరకయాతనతో మహిళ మృతి

Road Accident: రోడ్డు ప్రమాదం అనంతరం ఆర్టీసీ బస్సు అరగంటకుపైగా కాలుపైనే ఉండిపోవడంతో బాధిత మహిళ నరక యాతన అనుభవించి ప్రాణాలు విడిచారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Road Accident
రోడ్డు ప్రమాదం

By

Published : Nov 21, 2022, 1:33 PM IST

Road Accident: రోడ్డు ప్రమాదం అనంతరం ఆర్టీసీ బస్సు అరగంటకుపైగా కాలుపైనే ఉండిపోవడంతో బాధిత మహిళ నరక యాతన అనుభవించి ప్రాణాలు విడిచారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సి.బెళగల్‌ మండలం కృష్ణందొడ్డికి చెందిన గొల్ల మద్దిలేటి, గోవిందమ్మ దంపతులు బేతంచెర్లలోని అయ్యలచెరువువద్ద ఉన్న ఓ పరిశ్రమలో పని చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం మద్దిలేటి, గోవిందమ్మ అయ్యల చెరువు నుంచి ద్విచక్ర వాహనంపై పట్టణంలోకి వెళ్తుండగా.. కర్నూలు నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరి బండిని ఢీకొంది.

గోవిందమ్మ కాలి తొడపై బస్సు టైర్లు ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డారు. మద్దిలేటికీ గాయాలయ్యాయి. బాధితురాలిని చికిత్స నిమిత్తం పీహెచ్‌సీకి తరలిస్తుండగా మృతి చెందారు. ఆర్టీసీ బస్సు గోవిందమ్మ కాలుపై నిలిచిపోయిన అనంతరం డ్రైవర్‌ పారిపోవడంతో.. ఎవరి సాయమూ అందక.. అరగంటపాటు అలాగే ఉండిపోవడంతో ఆమె మృతి చెందిందని, వెంటనే తీసి ఉంటే తన భార్య బతికేదని మద్దిలేటి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details