ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు

Railway police arrested inter state robbers: రైళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 77 సెల్‌ఫోన్‌లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, 9 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులే లక్ష్యంగా వీరు దొంగతనాలు చేస్తుంటారని గుంతకల్లు రైల్వే ఎస్పీ చౌడేశ్వరీ తెలిపారు.

Railway police arrested inter state robbers
అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన రైల్వే పోలీసులు

By

Published : Dec 14, 2022, 7:44 PM IST

Interstate Thieves Arrest: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్పీ చౌడేశ్వరీ వెల్లడించారు. రైళ్లల్లో ప్రయాణికుల విలువైన వస్తువులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. గుంతకల్లు జిల్లా పరిధిలోని నంద్యాలలో.. రైళ్లలో చోరీలకు పాల్పడిన సంతోష్, రామకృష్ణలను అదుపులోకి తీసుకుని.. తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఎట్టకేలకు వారు చేసిన దొంగతనాలు చెబుతుంటే పోలీసులు షాక్​ తిన్నారు. నిందితుల నుంచి 77 సెల్ ఫోన్లు, 5 లాప్​టాప్​లు, 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

రైళ్లలో చోరీ చేసిన దొంగ సొమ్మును భద్రంగా తీసుకెళ్లేందుకు.. రైల్వే స్టేషన్​లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను సైతం ఈ దొంగలు వదల్లేదని ఎస్పీ వెల్లడించారు. కాజేసిన దొంగ సరుకును మరో మీడియేటర్ రామకృష్ణ ద్వారా అమ్మి.. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేశారని ఆమె తెలిపారు.

అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన రైల్వే పోలీసులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details