ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Police Raids: మూడు నాటు తుపాకులు.. 10 లీటర్ల నాటుసారా స్వాధీనం

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలో వేరువేరు ప్రాంతాలలో జరిపిన దాడుల్లో 3 నాటు తుపాకులు, 10 లీటర్ల నాటుసారాయిని భాకరాపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

recovered three guns
recovered three guns

By

Published : Aug 5, 2021, 8:02 PM IST

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలో వేరువేరు ప్రాంతాలలో జరిపిన దాడుల్లో మూడు నాటు తుపాకులు, 10 లీటర్ల నాటు సారాయిని భాకరాపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని భాకరాపేట పోలీసులకు అందిన సమాచారంతో వేరువేరు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మూడు నాటు తుపాకులతో పాటుగా 10 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని బొంతినివారిపల్లికి చెందిన చెంగలరాయులు ఇంటి పరిసరాలలో పాతిపెట్టిన మూడు నాటు తుపాకులను పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను పసిగట్టిన చెంగలరాయులు ఇంటి నుంచి పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరోవైపు... మండలంలోని తుమ్మచెనుపల్లి, దేవరకొండలలో 10 లీటర్ల నాటుసారాయిని, సారా తయారీకి ఉపయోగించే సామగ్రితో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే తమ దృష్టికి తీసుకురావాలని.. సమాచారం తెలిపిన వారిపేర్లను రహస్యంగా ఉంచుతామని సీ.ఐ మురళి కృష్ణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details