PERSON DIED IN NEAR VANJANGI : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి సమీపంలో.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించారు. మరొకరు గాయాలపాలై.. ఆస్పత్రిలో చేరారు. విజయనగరం జిల్లా S.కోట నుంచి వంజంగిని సందర్శించేందుకు ఇద్దరు మిత్రులు బైక్‌పై వచ్చారు. తెల్లవారుజామున మంచు కారణంగా నిర్మాణంలో ఉన్న కల్వర్టు కనిపించకపోవడంతో.. నేరుగా అందులో పడిపోయారు. బైక్ పూర్తిగా బురదలో కూరుకుపోయింది. సిద్ధు అనే వ్యక్తి బురదలో పడిపోయి మరణించారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఇతర వాహనదారులు.. స్థానికుల సహాయంతో ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. సిద్ధు అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న కల్వర్టుకు కనీస రక్షణ ఏర్పాటు చేయలేదని స్థానికులు చెబుతున్నారు.
Accident : వంజంగి సమీపంలో కల్వర్టులోకి దూసుకెళ్లిన బైక్.. ఒకరు మృతి
ACCIDENT AT VANJANGI TOURIST PLACE : పర్యాటక కేంద్రాన్ని చూడటానికి వచ్చిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. తెల్లవారుజామున బైక్‌పై వస్తున్న యువకులకు మంచు కారణంగా నిర్మాణంలో ఉన్న కల్వర్టు కనిపించకపోవడంతో.. నేరుగా అందులో పడిపోయారు. ఈ ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది.
PERSON DIED IN NEAR VANJANGI