Suicide: పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి.. విజయవాడ మాచవరం పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక హోటల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురిని నమ్మి మోసపోయానని అతడు వీడియోలో పేర్కొన్నాడు. తీసుకున్న సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుకోటి సతీష్ కుమార్, ములుకోటి చైతన్య, సునీల్ అనే ముగ్గురు వ్యక్తులు తన చావుకు కారణమని పేర్కొన్న శ్రీకాంత్.. ఒక యువతితో తనను ట్రాప్ చేశారని ఆరోపించాడు. బెదిరించి తన నుంచి డబ్బు వసూలు చేయడమే కాకుండా భార్యాబిడ్డల్ని చంపుతామని భయపెడుతున్నారని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అయితే ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మృతుడి ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.
Selfie Suicide: 'నా చావుకి కారణం... ఆ ముగ్గురే'.. సెల్ఫీ వీడియోతో వెలుగులోకి - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు
Suicide: విజయవాడ మాచవరం పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపింది. ముగ్గురి వ్యక్తుల చేతిలో మోసపోయినట్లు సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
'నా చావుకి కారణం.. ఆ ముగ్గురే'.. ఆలస్యంగా వెలుగుచూసిన వ్యక్తి సెల్ఫీ వీడియో