ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

అప్పు చెల్లించినా బ్లాక్‌మెయిల్.. ఫొటో మార్ఫ్‌ చేస్తామంటూ బెదిరింపులు! - రుణ యాప్ నిర్వాహకుల బెదిరింపులు

Loan Apps organizers Threats: వందల యాప్‌లు తొలగిస్తున్నా.. పోలీసులు నిత్యం నిఘా పెట్టి కాల్‌సెంటర్లు, కార్యాలయాలపై దాడులు చేస్తున్నా.. రుణయాప్‌ల ఆగడాలు తగ్గడంలేదు. అసభ్య పదజాలంతో దూషణలు, ఫొటోలను మార్ఫ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తామంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. పైసా రుణానికి పాతిక చొప్పున వసూలు చేస్తూ.. అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారు.

Loan Apps organizers Threats
Loan Apps organizers Threats

By

Published : Mar 28, 2022, 5:13 PM IST

అప్పు చెల్లించినా బ్లాక్‌మెయిల్..

Loan Apps organizers Threats: చైనా రుణయాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్న వారికి వేధింపులు తప్పడం లేదు. తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లిస్తున్నా.. వేధింపులపర్వం కొనసాగుతోంది. వేలు తీసుకుంటే లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేధింపులు తాళలేక.. ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవలే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెహిదీపట్నంకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయురాలు కూడా ప్రాణం తీసుకుంది.

సికింద్రాబాద్‌కు చెందిన ఓ మహిళ రూ. 60 వేలు అప్పు తీసుకుని 15 రోజుల్లో చెల్లించింది. అయినప్పటికీ.. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి నగ్న వీడియోలు ప్రచారం చేస్తామంటూ బెదిరించి.. ఆమె నుంచి 6లక్షలు వసూలు చేశారు. ఇప్పటికే ఇలాంటి వందల యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించేలా చేసిన పోలీసులు.. కొత్తగా మరో 150 యాప్‌లను గుర్తించారు. వీటిని తొలగించాలంటూ గూగుల్‌ ప్రతినిధులకు లేఖలు రాశారు. క్యాష్‌ బీయింగ్‌, ఈజీలోన్‌, లక్కీరూపీ, ఇన్ఫినిటీ క్యాష్‌, మినిట్‌ క్యాష్‌ వంటి 50 యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి గూగుల్‌ తొలగించింది.

"నేటి యువత తమ అవసరాల కోసం రుణ యాప్‌లపై ఆధారపడుతున్నాయి. అకస్మాత్తుగా అప్పు తీసుకోవాల్సి వస్తే ఎవర్నీ అడగలేక.. వాటి నుంచి రుణం తీసుకుంటున్నారు. తర్వాత వాటిని కష్టపడి వడ్డీతో సహా చెల్లిస్తున్నారు. వేలల్లో తీసుకుంటే వడ్డీతో సహా లక్షల్లో కడుతున్నారు. అయినా లోన్ యాప్ నిర్వాహకులు వారి నుంచి మరింత డబ్బు గుంజాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఫొటోలు మార్ఫ్ చేస్తామంటూ.. తమ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారికి మెసేజ్‌లు పంపిస్తామంటూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వీటిని తట్టుకుని కొందరు మా వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. తట్టుకోలేక మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎంత అవసరమొచ్చినా.. రుణ యాప్‌లపై మాత్రం ఆధారపడకండి. ఇబ్బందులు పడకండి. ప్రాణాలు తీసుకోకండి. సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కోండి. లేదా మాకు ఫిర్యాదు చేయండి." - పోలీసులు

Loan Apps Cases: సులభంగా రుణాలు ఇస్తామంటూ వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా యాప్‌ నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు. 10 వేల రూపాయల నుంచి 2 లక్షల వరకు రుణం ఇస్తామని, 15 నుంచి 21 రోజుల్లోపు చెల్లంచాలంటూ.. షరతులు విధిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రుణం తీసుకుంటున్న బాధితులు.. వాటిని తీర్చడానికి మళ్లీ మళ్లీ అప్పులు చేస్తూ.. రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. సులభంగా వచ్చే రుణాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details