ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

lady thief: బ్యాగులు కత్తిరించింది.. అడ్డంగా బుక్కైంది..

నెల్లూరు జిల్లాలో ఓ ఆలయంలో చోరీకి పాల్పడుతున్న మహిళా దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ భక్తురాలి బ్యాగులో నగదు దొంగిలించడాన్ని సీసీ కెమెరాలో గుర్తించిన ఆలయ సిబ్బంది.. ఆమెను పోలీసులకు అప్పగించారు.

By

Published : Oct 25, 2021, 10:22 AM IST

lady thief caught at nellore district kamakshi thayi temple
lady thief caught at nellore district kamakshi thayi temple

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి రెడ్డి పాలెంలోని జొన్నవాడ కామాక్షిమాతాయి ఆలయంలో చోరీకి పాల్పడుతున్న ఓ మహిళా దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు చోరీకి గురవుతోందని.. భక్తుల నుంచి ఫిర్యాదులు అధికమవడంతో ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అధికారులు పరిశీలించారు. ఓ భక్తురాలి బ్యాగులో నగదును. ఓ మహిళ దొంగలించడాన్ని సీసీ కెమెరాలో గుర్తించారు. ఆ మహిళ మళ్లీ ఆలయానికి రావడం... గుర్తించిన ఆలయ సిబ్బంది ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

కామాక్షిమాతాయి ఆలయంలో చోరీ

ABOUT THE AUTHOR

...view details