కర్నూలు జిల్లా నందవరం మండలం పోనకలదిన్నె గ్రామానికి చెందిన రాధకు.. దేవనకొండ మండలం కుక్కటికొండ గ్రామానికి చెందిన సుధాకర్‌తో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. కొన్ని రోజులుగా రెండో వివాహం చేసుకుంటానని భార్యను వేధిస్తున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వేధింపులపై గతంలో అతనికి పోలీసులతో కౌన్సెలింగ్ చేయించామని మృతురాలి తండ్రి చెబుతున్నారు. భర్త వేధింపులను తట్టుకోలేక భార్య రాధ ఆదివారం పురుగుల మందు తాగింది.. చికిత్స పొందుతూ కర్నూలు ఆసుపత్రిలో ఈరోజు మృతి చెందింది.
భర్త వేధింపులు భరించలేక.. భార్య ఆత్మహత్య - కర్నూల జిల్లా తాజా వార్తలు
పెళ్లై 13 ఏళ్లు అవుతుంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినా రెండో భార్య కావాలంటూ నిత్యం భార్యను వేధిస్తున్నాడు. పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించినా అతను మారలేదు. భర్త హింసను తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
Husband harassment