డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ మొదలైంది. ఈ మేరకు ఎక్సైజ్ సిట్ అధికారి శ్రీనివాస్ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించారు. 2017లో డ్రగ్స్ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన శ్రీనివాస్.. నేడు ఈడీ అధికారులకు పూర్తి వివరాలు సమర్పించారు. సిట్ దర్యాప్తు క్రమాన్ని ఈడీకి వివరించారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో(Tollywood Drugs case) రేపటి నుంచి ఈడీ(ED) విచారణ జరపనుంది. ఈ మేరకు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దర్శకుడు పూరీ జగన్నాథ్(Puri Jagannadh) రేపు విచారణకు హాజరుకానున్నారు.
రేపటి నుంచి సెప్టెంబర్ 22 వరకు..
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో(Tollywood Drugs case) మనీలాండరింగ్ కేసు(Money laundering case) నమోదు చేసిన ఈడీ అధికారులు... దర్శకుడు పూరి జగన్నాథ్‌ను(Puri Jagannadh) రేపు ప్రశ్నించనున్నారు. ఈ మేరకు ఆయనకు ఈడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రేపు ప్రారంభమయ్యే విచారణ సెప్టెంబర్ 22 వరకు కొనసాగనుంది. సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు జారీ చేశారు. నిర్ధేశించిన తేదీల్లో విచారణకు హాజరుకావాలని సూచించారు.