ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

DSP: నలుగురు విద్యార్థినులు పారిపోవడంపై.. డీఎస్పీ నరసప్ప దర్యాప్తు

DSP: తిరుపతి జిల్లాలోని సంప్రదాయ పాఠశాల నుంచి నలుగురు విద్యార్థినులు పారిపోవటంపై.. డీఎస్పీ నరసప్ప దర్యాప్తు చేపట్టారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థినుల వివరాలు సేకరించారు. పాఠశాల ప్రహరీ గోడకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

dsp narasappa enquiry
నలుగురు విద్యార్థినులు పారిపోవడంపై.. డీఎస్పీ నరసప్ప దర్యాప్తు

By

Published : May 9, 2022, 6:38 PM IST

DSP: తిరుపతి జిల్లా చంద్రగిరిలోని సంప్రదాయ పాఠశాల నుంచి నలుగురు విద్యార్థినిలు పారిపోయిన ఘటనపై... డీఎస్పీ నరసప్ప దర్యాప్తు చేపట్టారు. సంప్రదాయ పాఠశాలకు వెళ్లి విద్యార్థినుల వివరాలు సేకరించారు. నిన్న రాత్రి విద్యార్థినులు పాఠశాల గోడ దూకి పారిపోయిన వెంటనే.. ఇన్‌ఛార్జి లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పారిపోయిన నలుగురు విద్యార్థినులు చంద్రగిరి శ్రీనివాస డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు.

నలుగురు విద్యార్థినులు పారిపోవడంపై.. డీఎస్పీ నరసప్ప దర్యాప్తు

పారిపోయిన నలుగురు విద్యార్థినులు విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరం, కడప జిల్లాలకు చెందిన వారుగా వెల్లడించారు. పాఠశాల ప్రహరీ గోడకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థినుల కోసం రాత్రి నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. పారిపోయిన నలుగురు విద్యార్థినుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్లు డీఎస్పీ నరసప్ప తెలిపారు.

మగ పిల్లలకు వేద పాఠశాల ఎలానో.. అదేవిధంగా ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా సంప్రదాయ పాఠశాల నిర్వహిస్తున్నట్టు ఇంచార్జ్ లక్ష్మి తెలిపారు. కంచి కామకోటి పీఠాధిపతి ఆధ్వర్యంలో ఇది నడుస్తుందని ఆమె వెల్లడించారు. నిన్న రాత్రి నలుగురు అమ్మాయిలు గోడ దూకి పారిపోయారనే సమాచారాన్ని వెంటనే పోలీసులకు, పిల్లల తల్లిదండ్రులకు అందించామన్నారు.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details