ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

'కౌన్‌ బనేగా...' పేరుతో మహిళకు రూ.39 లక్షలు కుచ్చుటోపీ

Cyber Crimes: సైబర్ నేరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా... బాధితుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. తెలంగాణలోని మూడు కమిషనరేట్‌ల పరిధిలో నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కౌన్‌ బనేగా కరోడ్‌పతి పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

1
1

By

Published : Jul 5, 2022, 7:07 PM IST

తెలంగాణంలో 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' లాటిరీ పేరుతో మహిళను నిలువునా ముంచాడు ఓ సైబర్ మోసగాడు. 25 లక్షల రూపాయల లాటరీ గెలుచుకున్నారని... చెప్పి ఆ మహిళ నుంచి 39 లక్షలు కాజేసి కుచ్చు టోపి పెట్టాడు.

అసలేం జరిగిందంటే...కేబీసీ(కౌన్ బనేగా కరోడ్‌పతి) లాటిరీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో ఖైరతాబాద్‌కు చెందిన ఓ మహిళకు 25లక్షలు లాటరీ గెలుచుకున్నారని సందేశం వచ్చింది. స్పందించిన మహిళ సందేశంలో ఉన్న నంబరుకు ఫోన్ చేసింది. గెలుచుకున్న నగదు విత్ డ్రా చేయాలంటే పలు రకాల ఫీజులు కట్టాలని తెలుపగా.. విడతల వారీగా నగదును రాకేశ్‌ తెలిపిన ఖాతాకు బదీలి చేశారు.

ఇంతటితో ఆగకుండా చివరకు బ్యాంకు అధికారిలా ఫోన్ చేశారు. 'మీ ఖాతాలో డబ్బు జమ కావల్సి ఉందని.. కొన్ని ఛార్జీలు కట్టాలని బురిడి కొట్టించి మొత్తం రూ.39లక్షలు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు రాకేశ్‌ కుమార్‌ను బీహార్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు... అతని నుంచి 16 చరవాణులు, 73 డెబిట్ కార్డులు, 30సిమ్ కార్డులు, 11బ్యాంకు పాస్‌బుక్‌లు, 2 చెక్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌కు చెందిన రాకేశ్‌... తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా నేరాలకు పాల్పడి కోట్లలో డబ్బు కాజేశాడని గుర్తించారు. ఇప్పటివరకు కౌన్‌ బనేగా కరోడ్‌పతి పేరుతో రూ.3 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details