ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

SUSPENDED: ఎస్సైపై అత్యాచార ఆరోపణలు.. సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు - miryalaguda si vijay latest news

SUSPENDED: మల్కాజిగిరి సీసీఎస్ ఎస్సై పెళ్లి పేరిట తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శాఖాపరమైన విచారణ ప్రారంభించిన​ ఉన్నతాధికారులు.. విజయ్‌ను సస్పెండ్ చేశారు.

SUSPENDED
SUSPENDED

By

Published : Jul 10, 2022, 2:28 PM IST

SUSPENDED: హైదరాబాద్‌లో మహిళపై కన్నేసిన ఓ పోలీసు అధికారి తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవక ముందే.. అలాంటి ఘటనే రాష్ట్రంలో మరొకటి చోటు చేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ పోలీసు అధికారిపై అత్యాచారం ఆరోపణలు నమోదయ్యాయి. మల్కాజిగిరి సీసీఎస్​లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న విజయ్​పై నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. తనను ప్రేమించి.. పెళ్లి పేరుతో సహజీవనం చేసి మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..

మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ యువతి, సూర్యాపేట జిల్లా దురాజ్​పల్లి గ్రామానికి చెందిన ఎస్సై ధరావత్​ విజయ్​లు కాలేజీ రోజుల(గత పదేళ్లుగా) నుంచి ప్రేమించుకుంటున్నారు. దూరపు బంధువులు, ఒకే కులానికి చెందిన వారు కావడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి విజయ్​ యువతితో సహజీవనం చేశాడు. తీరాచూస్తే ఆరేళ్ల క్రితం విజయ్​ తన మేనమామ కూతురుని వివాహం చేసుకున్నాడు. (వారికి ఒక కుమారుడు ఉన్నాడు.) తన పరిస్థితి ఏంటని బాధిత యువతి ప్రశ్నిస్తే.. భార్యకు విడాకులు ఇచ్చి తనను వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. ఆరేళ్ల నుంచి అదే సమాధానం చెబుతూ కాలం వెళ్లదీస్తున్నాడు.

ఎస్సై విజయ్

బాధిత యువతిని వదులుకోవడం ఇష్టం లేదని చెబుతూ.. ఆమెకు వచ్చే పెళ్లి సంబంధాలనూ చెడగొడుతున్నాడు. ఇటు భార్యతో కాపురం, యువతితో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారని.. పెళ్లి చేసుకోవాలని బాధిత యువతి విజయ్​ను కోరింది. అతను మళ్లీ పాత సమాధానాలే చెబుతూ.. దాటవేస్తుండటంతో విసిగిపోయి పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనతో సహజీవనం చేసి మోసం చేశాడని విజయ్​పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిర్యాలగూడ ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు ఎస్సై విజయ్​పై ఆరోపణల నేపథ్యంలో శాఖాపరమైన విచారణ ప్రారంభించిన పోలీస్​ ఉన్నతాధికారులు.. విజయ్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details