ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

TS CM KCR: కొత్తపల్లి ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం - తెలంగామ ముఖ్యమంత్రి కేసీఆర్ వార్తలు

తెలంగాణలో గోడ కూలి ఐదుగురు మృతి చెందిన ఘటనపై సీఎం కేసీఆర్(CM KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

TS CM KCR
TS CM KCR

By

Published : Oct 10, 2021, 2:11 PM IST

తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లిలో గోడ కూలి ఐదుగురు మృతిచెందిన ఘటనపై సీఎం కేసీఆర్(CM KCR about wall collapse incident) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబంలో మిగతా వారికి ప్రభుత్వపరంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పించి.. అండగా ఉంటామని భరోసానిచ్చారు. మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి ఘటనపై ఆరా(CM KCR about wall collapse incident) తీశారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, నిర్మాణాలను అధికారులు గుర్తించాలని ఆదేశించారు. ప్రజలను సురక్షిత స్థావరాలకు తరలించాలని సూచించారు.

మంత్రి స్పందన

కొత్తపల్లి ఘటన దురదృష్టకరమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(niranjan reddy about wall collapse incident) అన్నారు. గోడకూలి ఐదుగురు మరణించిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో బలహీనంగా, ప్రమాదకరంగా ఉన్న గృహాలు, పరిసరాలను గుర్తించి... ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. భారీ వర్షాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.

ఇదీ జరిగింది..

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అయిజ మండలం కొత్తపల్లిలో గోడకూలి ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు మోషా, సుజాతమ్మ, చరణ్, రాము, తేజగా గుర్తించారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. వర్షానికే ఇంటి గోడ కూలిందని చెబుతున్నారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం, మృతులను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వర్షాలు కురిసేటప్పుడు శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండకూడదని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు

ఇదీ చదవండి

Telangana: అర్థరాత్రి ఘోరం.. నిద్రలోనే ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details