ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

టీకాల పేరుతో నిర్మాత సురేశ్‌ బాబుకు లక్ష టోకరా

కరోనా టీకా పేరుతో సైబర్​ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి సినీ నిర్మాత సురేశ్​ బాబునే మోసం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

cine producer suresh babu
cine producer suresh babu

By

Published : Jun 22, 2021, 10:58 AM IST

టీకాలు ఇప్పిస్తానంటూ ప్రముఖ సినీ నిర్మాత సురేశ్‌బాబుకు ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు . 500 డోసుల టీకాలు ఉన్నాయని సురేశ్‌బాబుకు నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఫోన్‌ చేశాడు. తన భార్య బ్యాంకు ఖాతాకు రూ.లక్ష బదిలీ చేయాలని కోరాడు. అతడి మాటలు నమ్మి రూ.లక్ష బదిలీ చేశారు సురేశ్‌బాబు. నగదు డ్రా చేసుకున్న తర్వాత నిందితుడు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. నాగార్జునరెడ్డిపై జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో సురేశ్‌బాబు సహాయకుడు ఫిర్యాదు చేశారు.

నాగర్జున రెడ్డిని నాలుగు రోజుల క్రితమే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ ప్రతినిధిని టీకాల పేరుతో మోసగించిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్‌ పీఏ నంటూ నమ్మించి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్ ప్రతినిధిని మోసగించాడు. ప్రస్తుతం సంగారెడ్డి జైల్‌లో రిమాండ్ ఖైదీగా నాగర్జున రెడ్డి ఉన్నాడు.

ఇదీ చూడండి:

మోదీకి బ్యానర్లు కట్టాలని విద్యాసంస్థలకు ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details