అమ్మఒడి పథకం పేరు చెప్పి కేటుగాళ్లు డబ్బులు కొట్టేసిన ఘటన కృష్ణాజిల్లా గన్నవరంలో జరిగింది. గ్రామ వాలంటీర్‌కు ఫోన్ చేసిన మోసగాళ్లు అమ్మఒడి పథకం ద్వారా లబ్ధిపొందని తల్లిదండ్రులకు కాన్పరెన్స్ కలపమని చెప్పారు. ఈ క్రమంలో మోసానికి పాల్పడ్డారు. నాగేంద్ర అనే వ్యక్తి బ్యాంకు వివరాలు సేకరించి రూ. 13 వేలు దోచేశారు.
అమ్మఒడి పథకం పేరుతో ఫోన్ చేశారు.. రూ. 13 వేలు కాజేశారు!
అమ్మఒడి పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడిన ఘటన కృష్ణాజిల్లాలో జరిగింది. బ్యాంక్ వివరాలను సేకరించిన కేటుగాళ్లు బాధితుడి ఖాతా నుంచి రూ.13 వేలు కొల్లగొట్టారు.
అమ్మఒడి పథకం పేరుతో ఫోన్ చేశారు.. రూ. 13 వేలు కాజేశారు!
ఈ ఘటనపై బాధితులు గన్నవరం పాలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ ఫోన్ కాన్పరెన్స్‌లో ఉండగా.. తాము డబ్బులు పంపించామని నాగేంద్ర వాపోయారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గన్నవరం సీఐ కోమాకుల శివాజీ చెప్పారు.
ఇదీ చదవండి:వీరవల్లిలో వ్యక్తి మృతి.. అధికారుల వేధింపులే కారణమన్న కుటుంబీకులు